LOADING...
IPL 2023: ఐపీఎల్‌లో యువ ఆటగాళ్లకు గట్టి పోటిస్తున్న సీనియర్ ఆటగాళ్లు
ఐపీఎల్ లో రాణిస్తున్న అమిత్ మిశ్రా, మోహిత్ శర్మ

IPL 2023: ఐపీఎల్‌లో యువ ఆటగాళ్లకు గట్టి పోటిస్తున్న సీనియర్ ఆటగాళ్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 14, 2023
10:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతోంది. చివరి బంతి వరకూ మ్యాచ్ కొనసాగుతుండటంతో అభిమానులకు మంచి కిక్కునిస్తోంది. అంచనాల్లేని ఆటగాళ్లు అనూహ్య ఫలితాలను రాబట్టడంతో మంచి మజానిస్తోంది. అయితే కెరీర్ చరమాంకంలో ఉన్న ఆటగాళ్లు తమ అద్భుత ప్రదర్శనతో అకట్టుకుంటున్నారు. గత వారం రోజులుగా ఐపీఎల్ 2023 సీజన్ లో సీనియర్ ఆటగాళ్లే తమ అద్భుతమైన ఆటతీరుతో మ్యాచ్ ఫలితాలను మార్చేస్తున్నారు. యువ ప్లేయర్లకు తాము ఏమీ తీసిపోమంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొన్న అమిత్ మిశ్రా.. నిన్న సందీప్ శర్మ, నేడు మోహిత్ శర్మ తమ అద్భుత బౌలింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు.

ధోని

బ్యాటింగ్ లోనూ సీనియర్లు హవా

రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ.. చైన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆఖరి ఓవర్‌లో ధోనిని పరుగులు చేయకుండా కట్టడి చేశారు. దీంతో రాజస్థాన్ విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ లో రీ ఎంట్రీ ఇచ్చిన మోహిత్ శర్మ ఆసాధారణ బౌలింగ్ తో పంజాబ్ పతనాన్ని శాసించాడు. 2020 లో అతను చివరిసారిగా ఐపీఎల్ లో ఆడాడు. ఇక బ్యాటింగ్ లో అంజిక్యా రహానే, మహేంద్ర సింగ్ ధోని, అంబటిరాయుడు, శిఖర్ ధావన్ కుర్రాళ్ల కంటే వేగంగా పరుగులు చేస్తూ మ్యాచ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.