ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా కగిసో రబడ అరుదైన ఘనత
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గురువారం రాత్రి పంజాబ్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్ స్టార్ పేసర్ కగిసో రబడ సరికొత్త రికార్డును సృష్టించాడు. అంతేకాకుండా చైన్నై మాజీ ప్లేయర్ డ్వేన్ బ్రావో పేరిట ఉన్న రికార్డును రబడ బద్దలు కొట్టి తన పేరిట రాసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో వృద్ధిమాన్ సాహా వికెట్ తీసి ఆ ఆరుదైన ఫీట్ ను నమోదు చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్ లో 100 వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్రకెక్కాడు. లసిత్ మలింగ్ 70 మ్యాచ్‌లో ఆ రికార్డును సొంతం చేసుకోగా.. రబడ కేవలం 64 మ్యాచ్ లోనే ఆ ఘనతను అందుకున్నాడు.
పంజాబ్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
ఇక భువనేశ్వర్ కుమార్(81), రషీద్ ఖాన్(82), అమిత్ మిశ్రా 83 మ్యాచ్‌లో 100 వికెట్లు తీసిన విషయం తెలిసిందే. బ్రావో 1619 బంతుల్లోనే ఈ ఘనత సాధించగా.. రబాడా 1438 బంతుల్లోనే 100 వికెట్లు తీయడం విశేషం. మ్యాచ్ విషయానికొస్తే మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ 36, జితేశ్ శర్మ 25 పరుగులతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో షమి, జోష్ లిటిల్, జోసెఫ్, రషీద్ ఖాన్ తలా ఓ వికెట్ సాధించారు. లక్ష్య చేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ ఒక బంతి మిగిలి ఉండగానే 154 పరుగులు చేసి లక్ష్యాన్ని అందుకుంది.