Page Loader
Ipl 2025: పంజాబ్, దిల్లీ మ్యాచ్.. భారత సైన్యానికి మద్దతుగా బీసీసీఐ సాంస్కృతిక కార్యక్రమాలు 
పంజాబ్, దిల్లీ మ్యాచ్.. భారత సైన్యానికి మద్దతుగా బీసీసీఐ సాంస్కృతిక కార్యక్రమాలు

Ipl 2025: పంజాబ్, దిల్లీ మ్యాచ్.. భారత సైన్యానికి మద్దతుగా బీసీసీఐ సాంస్కృతిక కార్యక్రమాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 08, 2025
05:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం 'ఆపరేషన్‌ సిందూర్‌' పేరుతో పాకిస్థాన్‌తో పాటు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఉగ్రదళాల నిర్మూలన కోసం తీవ్ర దాడులు చేసింది. ఈ నేపథ్యంలో భారత సైన్యం ప్రదర్శించిన సాహసం,ధైర్యాన్ని స్మరించుకోవాలన్న ఉద్దేశంతో వారికి సంఘీభావం తెలపాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)నిర్ణయం తీసుకుంది. ఈరోజు ధర్మశాల వేదికగా జరగనున్న పంజాబ్ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ఐపీఎల్ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు బీ ప్రాక్‌(ప్రతీక్‌ బచన్‌)సారధ్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా,దేశ రక్షణలో అగ్రగామిగా ఉన్న భారత సైనికుల పట్ల గౌరవ సూచనగా ఆయన దేశభక్తి గీతాలను ఆలపించనున్నారు.

వివరాలు 

భారత సైన్యానికి మద్దతుగా జాతీయ గీతం 

అంతేగాక, మే 7న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కు ముందు ఇరుజట్ల క్రికెటర్లు, మిగతా సిబ్బంది భారత సైన్యానికి మద్దతుగా జాతీయ గీతాన్ని గౌరవంగా ఆలపించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఐపీఎల్ చేసిన ట్వీట్