Page Loader
LSG vs PBKS: నేడు లక్నో, పంజాబ్‌ జట్ల మధ్య మ్యాచ్.. పరుగుల వరద ఖాయం
నేడు లక్నో, పంజాబ్‌ జట్ల మధ్య మ్యాచ్.. పరుగుల వరద ఖాయం

LSG vs PBKS: నేడు లక్నో, పంజాబ్‌ జట్ల మధ్య మ్యాచ్.. పరుగుల వరద ఖాయం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2025
01:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్‌, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ జరగనుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇరు జట్లలో హార్డ్ హిట్టర్లు ఉన్నందున మ్యాచ్ ఉత్కంఠగా సాగనున్నది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచిన పంజాబ్ కింగ్స్ మరో విజయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో జట్టు పూర్తిగా మారిపోయింది. తొలి మ్యాచ్‌లో గుజరాత్‌పై ఘన విజయం సాధించిన పంజాబ్, శ్రేయస్‌(97*),ప్రియాంశ్ ఆర్య(47), శశాంక్ సింగ్(44)అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. మ్యాక్స్‌వెల్, స్టోయినిస్ కూడా ఫామ్‌లోకి వస్తే,పంజాబ్‌కు మరో గెలుపు ఖాయమవుతుందని చెప్పొచ్చు.

వివరాలు 

గెలుపు లక్ష్యంతో బరిలోకి లక్నో.. 

బౌలింగ్ విభాగంలో అర్షదీప్ సింగ్, విజయ్‌కుమార్ వైశాక్ మంచి ప్రదర్శన కనబరిచారు. అయితే అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చహల్ మరింత ప్రభావం చూపించాల్సిన అవసరం ఉంది. లక్నో తన రెండో విజయాన్ని అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఓడిపోయింది, కానీ హైదరాబాద్‌పై అద్భుత విజయాన్ని అందుకుంది. మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ విధ్వంసకర ఆటతో జట్టును ముందుండి నడిపారు. కిల్లర్ మిల్లర్ కూడా కీలక పరుగులు సాధించాడు. అయితే, ఐడెన్ మార్క్‌రమ్, కెప్టెన్ రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యారు. వీరిద్దరితో పాటు బదోని కూడా ఫామ్‌లోకి వస్తే, లక్నో ప్రత్యర్థిని తేలిగ్గా ఓడించగలదు.

వివరాలు 

తుది జట్లు (అంచనా): 

బౌలింగ్ విభాగంలో శార్దూల్ ఠాకూర్, మణిమారన్ సిద్దార్థ్, దిగ్వేశ్ రతీ తగిన ప్రదర్శన కనబర్చారు. ఇరు జట్లలో హిట్టింగ్ పవర్ దృష్ట్యా ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశం ఉంది. పంజాబ్‌: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (కీపర్‌), ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, సూర్యాంశ్ షెడ్జ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్. లక్నో: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్‌రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, దిగ్వేశ్‌ రతీ, ప్రిన్స్ యాదవ్.