LOADING...
IPL 2025: ఐపీఎల్ ప్లేఆఫ్స్ కు ముందు ఆర్సీబీకి షాక్.. గాయం కారణంగా పడిక్కల్ అవుట్!
ఐపీఎల్ ప్లేఆఫ్స్ కు ముందు ఆర్సీబీకి షాక్.. గాయం కారణంగా పడిక్కల్ అవుట్!

IPL 2025: ఐపీఎల్ ప్లేఆఫ్స్ కు ముందు ఆర్సీబీకి షాక్.. గాయం కారణంగా పడిక్కల్ అవుట్!

వ్రాసిన వారు Sirish Praharaju
May 07, 2025
10:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 (IPL 2025) ప్లేఆఫ్స్ పోటీలో దూసుకెళుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న ఎడమచేతి బ్యాట్స్‌మన్ దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal) ఈ సీజన్‌కు అందుబాటులో ఉండబోవచ్చని స్పష్టమైంది. హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా అతను మిగతా మ్యాచ్‌ల నుంచి వైదొలుగుతున్నట్లు ఐపీఎల్ అధికారికంగా ప్రకటించింది. దాంతో అతని స్థానాన్ని భర్తీ చేయడానికి అనుభవజ్ఞుడైన బ్యాటర్ మయాంక్ అగర్వాల్‌ను ఆర్సీబీ ఎంపిక చేసింది. ఈ సందర్భంగా మయాంక్‌తో రూ.1 కోటి విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఫ్రాంఛైజీ వెల్లడించింది.

వివరాలు 

మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి..

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో బెంగళూరు జట్టు రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఆర్సీబీ విజయాల్లో పడిక్కల్ ఎంతో కీలకంగా నిలిచాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అద్భుతంగా రాణించాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన అతను రెండు అర్ధశతకాలతో కలిపి మొత్తం 247 పరుగులు నమోదు చేశాడు. గత కొన్ని సీజన్లలో పేలవ ప్రదర్శన చేసిన పడిక్కల్, ఈ సారి తన ఫారాన్ని తిరిగి అందుకుని నిలకడగా ఆడుతున్నాడు. అలాంటి సమయంలో అతను గాయంతో తప్పుకోవడం ఆర్సీబీకి గట్టి ఎదురుదెబ్బగా మారిందని చెప్పుకోవాలి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఐపీఎల్ నుండి గాయం కారణంగా పడిక్కల్ అవుట్!

Advertisement