LOADING...
IPL 2026 : 19 ఏళ్ల వయసులోనే రూ.14కోట్లకు అమ్ముడుబోయిన  కార్తిక్ శర్మ.. ఎవరు బ్రో నువ్వు.. నీ రికార్డ్స్ ఏంటి? 
ఎవరు బ్రో నువ్వు.. నీ రికార్డ్స్ ఏంటి?

IPL 2026 : 19 ఏళ్ల వయసులోనే రూ.14కోట్లకు అమ్ముడుబోయిన  కార్తిక్ శర్మ.. ఎవరు బ్రో నువ్వు.. నీ రికార్డ్స్ ఏంటి? 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 16, 2025
06:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 మినీ వేలం క్రికెట్ అభిమానులను విస్మయానికి గురి చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తీసుకున్న ఒక సంచలన నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షించింది. రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల యువ వికెట్ కీపర్-బ్యాటర్ కార్తీక్ శర్మను ఏకంగా రూ. 14.20 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసి చరిత్ర సృష్టించింది. ఈ డీల్‌తో కార్తీక్ శర్మ, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన అన్‌క్యాప్డ్ ఆటగాడిగా (ప్రశాంత్ వీర్‌తో కలిసి) నిలిచాడు.

వివరాలు 

ఎవరు ఈ కార్తీక్ శర్మ?

రాజస్థాన్‌కు చెందిన కార్తీక్ శర్మ కుడిచేతి వాటం బ్యాటర్ కాగా, వికెట్ కీపర్‌గా కూడా రాణిస్తున్నాడు. దూకుడైన బ్యాటింగ్ అతని ప్రధాన బలం. ముఖ్యంగా క్లీన్ హిట్టింగ్‌లో అతనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కార్తీక్ బ్యాటింగ్ స్టైల్‌ను చూసి కెవిన్ పీటర్సన్, రవిచంద్రన్ అశ్విన్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు ప్రశంసలు కురిపించారు. తన ఆటకు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీల నుంచి ప్రేరణ పొందినట్లు కార్తీక్ స్వయంగా పలుమార్లు పేర్కొన్నాడు.

వివరాలు 

వేలంలో జరిగిన ఉత్కంఠభరిత పరిణామాలు

వేలంలో కార్తీక్ శర్మ పేరు తెరపైకి రావడంతో ఫ్రాంచైజీల మధ్య పోటీ మొదలైంది. కేవలం రూ. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి అడుగుపెట్టాడు. మొదట ముంబై ఇండియన్స్ (MI) బిడ్డింగ్ ప్రారంభించగా, లక్నో సూపర్ జెయింట్స్ (LSG), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వెంటనే పోటీలోకి వచ్చాయి. ధర రూ. 5 కోట్లు దాటిన తర్వాత CSK, KKR మధ్య తీవ్ర పోరు సాగింది. చివరి దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కూడా ప్రయత్నించినప్పటికీ, చివరికి చెన్నై సూపర్ కింగ్స్ వెనక్కి తగ్గక రూ. 14.20 కోట్ల భారీ మొత్తంతో కార్తీక్ శర్మను తమ జట్టులోకి తీసుకుంది.

Advertisement

వివరాలు 

కార్తీక్ శర్మ గణాంకాలు & రికార్డులు

ఇంత భారీ ధర పలకడానికి కారణం అతని దేశవాళీ క్రికెట్ ప్రదర్శనలే. రంజీ ట్రోఫీ ఆరంభం: ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తొలి మ్యాచ్‌లోనే (ఉత్తరాఖండ్‌పై)113పరుగుల అద్భుత శతకంతో సంచలనం రేపాడు. టీ20లో దూకుడు: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాజస్థాన్ తరఫున ఆడుతూ 12మ్యాచ్‌లలో 164స్ట్రైక్ రేట్‌తో 334 పరుగులు చేశాడు.ఇందులో 28సిక్సర్లు ఉండటం విశేషం. లిస్ట్-A ప్రదర్శన: లిస్ట్-A క్రికెట్‌లో కేవలం 9మ్యాచ్‌ల్లోనే 445పరుగులు చేసి రాజస్థాన్ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎంఎస్ ధోని వారసుడి కోసం చూస్తున్న చెన్నైసూపర్ కింగ్స్,కార్తీక్ శర్మలో ఆ లక్షణాలను గుర్తించి ఉండొచ్చు. 19ఏళ్ల వయసులోనే రూ. 14.20కోట్ల ధర పలికిన ఈ యువ 'రాజస్థాన్ స్టార్' ఐపీఎల్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాల్సిందే.

Advertisement