IPL : డిసెంబర్ 15న ఐపీఎల్ 2026 వేలం?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్ వేలం ప్రక్రియ డిసెంబర్‌లో జరగవచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ మీడియా సమాచారం ప్రకారం, బీసీసీఐ డిసెంబర్ 15న వేలం నిర్వహించే యోచనలో ఉందని తెలుస్తోంది. నవంబర్ 15 లోపు అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించాల్సి ఉంది. గత రెండు సీజన్ల మాదిరిగే విధంగా, ఈసారి కూడా గల్ఫ్ దేశాల్లో వేలం నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ, తాజాగా వచ్చిన కథనాల ప్రకారం ఈ సారి వేలం భారత్‌లోనే జరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఏ నగరంలో ఈ వేలం జరగబోతోందని ఇంకా స్పష్టత లేదు.
Details
ఇప్పటివరకూ అధికారిక ప్రకటన చేయని బీసీసీఐ
2023లో దుబాయిలో, 2024లో జెడ్డాలో ఐపీఎల్ వేలం జరిగిందని గత రికార్డులు చెబుతున్నాయి. అయినప్పటికీ, ఐపీఎల్ 2026 వేలం గురించి బీసీసీఐ అధికారిక ప్రకటన ఇప్పటి వరకు చేయలేదు. ఇక మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్ కోసం నవంబర్ 27న దిల్లీలో మెగా వేలం జరగనుంది. ఇప్పటికే ఐదు జట్లే తమ రిటైన్ చేసిన ఆటగాళ్ల వివరాలను ప్రకటించాయి. దిల్లీ క్యాపిటల్స్‌లో 13 ఖాళీలు, గుజరాత్ జెయింట్స్‌లో 16, ముంబయి ఇండియన్స్‌లో 13, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో 14, యూపీ వారియర్స్‌లో 17 ఖాళీలున్నాయి. అత్యధికంగా యూపీ ఫ్రాంచైజీ పర్స్ రూ.14.5 కోట్లు ఉన్నట్లు సమాచారం.