
IPL 2026 Auction : ఐపీఎల్ వేలానికి డేట్ ఫిక్స్..? నవంబర్ 15 వరకు ఫ్రాంఛైజీలకు డెడ్‌లైన్..!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. 2008 లో ప్రారంభమైన ఈ లీగ్ ఇప్పటివరకు విజయవంతంగా 18 సీజన్లు పూర్తిచేసి, ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఇప్పుడు ఐపీఎల్ 19వ సీజన్ దిశగా అడుగులు వేస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్ కన్నా ముందు మినీ వేలం (IPL 2026 Auction) నిర్వహణకు బీసీసీఐ ఇప్పటికే సన్నాహకాలు చేస్తున్నారు. సమాచారం ప్రకారం ఈ వేలాన్ని డిసెంబర్ 13 నుంచి 15 వరకు జరగనుందని తెలిసింది.
వివరాలు
నవంబర్ 15 వరకు రిటైన్ చేసుకోవడానికి అవకాశం
ఫ్రాంచైజీలు తమకు కావలసిన ఆటగాళ్లను నవంబర్ 15 వరకు రిటైన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఆ తరువాత, తమకు ఉన్న ఆటగాళ్ల వివరాలు, రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు, వదిలివేసే ఆటగాళ్లు మొదలైన సమాచారాన్ని ఫ్రాంచైజీలు బీసీసీఐకు సమర్పించాల్సి ఉంటుంది. అధికారికంగా వేలం తేదీని ప్రకటించకపోయినప్పటికీ, డిసెంబర్ 13 నుంచి 15 మధ్య వేలం నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు బీసీసీఐ సమాచారం వెల్లడించింది. ఫ్రాంచైజీలతో ఈ విషయంపై చర్చలు పూర్తయ్యిన తర్వాత అధికారికంగా తేదీని ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఈ వేలం విదేశాల్లో జరుగుతుందా లేక భారతదేశంలోనే జరుగుతుందా అనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
వివరాలు
చెన్నై, రాజస్థాన్‌లలో భారీ మార్పులు..
ఇతర జట్లతో పోలిస్తే పెద్దగా మార్పులు లేకపోయినా, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లలో గణనీయమైన మార్పులు రావచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. చెన్నై జట్టు (CSK) ఈ సీజన్‌లో దీపక్ హుడా,విజయ్ శంకర్,రాహుల్ త్రిపాఠి,సామ్ కరన్ వంటి ఆటగాళ్లను వదిలివేసే అవకాశాన్ని పరిశీలిస్తోంది. అంతేకాక, అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో, CSKకి 9.75 కోట్లు ఖర్చు ఆదా అవుతుందని తెలుస్తుంది. అలాగే,రాజస్థాన్ రాయల్స్ నుంచి కెప్టెన్ సంజు శాంసన్ ఈ సీజన్‌లో జట్టులో ఉండకపోవచ్చనే వార్తలు ఇప్పటికే ప్రసారం అవుతున్నాయి. ఈ జట్టు కొన్ని కీలక మార్పులపై ఆలోచిస్తోంది.అలాగే, సీనియర్ స్పిన్నర్ వనిందు హసరంగా, యువ ప్రతిభ మహీష్ తీక్షణలు కూడా వేలంలోకి రాక అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.