IPL 2026: సీఎస్కేలో కీలక మార్పు.. ఫీల్డింగ్ కోచ్‌గా ఫోస్టర్ నియామకం
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుండగా, ఈ టోర్నీకి ముందు వివిధ ఫ్రాంచైజీలు తమ జట్లలో ముఖ్యమైన మార్పులు చేస్తున్నాయి. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తమ కొత్త ఫీల్డింగ్ కోచ్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ సీజన్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా ఇంగ్లండ్‌కు చెందిన మాజీ క్రికెటర్ జేమ్స్ ఫోస్టర్‌ను నియమించినట్లు తెలిపింది. ఈ విషయాన్ని సీఎస్కే ఫ్రాంచైజీ తమ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
వివరాలు
ఇదొక సరికొత్త ప్రయాణం..
45 ఏళ్ల ఫోస్టర్.. సీఎస్కే కోచింగ్ సిబ్బందిలో హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆధ్వర్యంలో పని చేయనున్నారు. ఇప్పటికే జట్టులో బ్యాటింగ్ కోచ్‌గా మైఖేల్ హస్సీ, బౌలింగ్ కోచ్‌గా సిమన్స్ పనిచేస్తున్నారు. తమ ఫీల్డింగ్ కోచ్‌గా జేమ్స్ ఫోస్టర్‌ను ఆహ్వానిస్తున్నామని, అంతర్జాతీయ స్థాయిలో విశేష అనుభవం కలిగిన ఇంగ్లండ్ మాజీ వికెట్ కీపర్ ఇప్పుడు సీఎస్కేతో తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారని సీఎస్కే తమ పోస్టులో తెలిపింది. 2001లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఫోస్టర్, ఇంగ్లండ్ తరపున 7 టెస్టులు, 11 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆటగాడిగా మాత్రమే కాకుండా కోచ్‌గా కూడా మంచి అనుభవం సంపాదించాడు.
వివరాలు
కోచ్‌గా కూడా మంచి అనుభవం
ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లతో కోచింగ్ విభాగంలో పనిచేసిన అనుభవం అతనికి ఉంది. ఇటీవల జరిగిన ఐఎల్టీ20 టోర్నీలో డెజర్ట్ వైపర్స్ జట్టుతో కలిసి టైటిల్‌ను అందుకున్నాడు. అదేవిధంగా బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా కూడా కొనసాగుతున్నాడు. ఇక ఐపీఎల్ 2026లో సీఎస్కే తన తొలి మ్యాచ్‌ను మార్చి 30న గువాహటిలో రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. అనంతరం ఏప్రిల్ 4న స్వదేశంలో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.