Loading...
IPL 2026: ఐపీఎల్ టైటిట్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌ పోరాటం..ఈసారైనా కల తీరేనా..?
ఐపీఎల్ టైటిట్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌ పోరాటం..ఈసారైనా కల తీరేనా..?

IPL 2026: ఐపీఎల్ టైటిట్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌ పోరాటం..ఈసారైనా కల తీరేనా..?

వ్రాసిన వారు Moogati Shabari
Mar 22, 2026
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ ప్రారంభం నుంచి కొనసాగుతున్న జట్లలో పంజాబ్‌తో పాటు ఇప్పటివరకు టైటిల్ సాధించలేని మరో జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే. ప్రతిభావంతుల కొరత లేకపోయినా, ట్రోఫీ మాత్రం ఆ జట్టుకు అందని లక్ష్యంగానే మిగిలింది. కెప్టెన్లు, కోచ్‌లు, ఆటగాళ్లలో మార్పులు చేసినా, జట్టు పేరును మార్చినా ఫలితం రాలేదు. ఇప్పుడు కొత్త మార్పులతో బరిలోకి దిగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి తమ కలను నిజం చేసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

వివరాలు

ఒకే ఒక్కసారి ఫైనల్‌కు..

ఇప్పటివరకు ఐపీఎల్‌లో జరిగిన 18 సీజన్లలో ఢిల్లీ జట్టు కేవలం ఒకసారి మాత్రమే (2020లో) ఫైనల్‌కు చేరింది.

మొత్తం సీజన్లలో ఆరు సార్లు మాత్రమే లీగ్ దశ దాటగలిగింది.

2019 నుంచి 2021 వరకు వరుసగా మూడు సీజన్లలో ప్లేఆఫ్స్ చేరింది.

నాలుగేళ్లుగా ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోలేకపోయింది.

అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఈ జట్టు ప్రస్తుతం ప్రధాన టైటిల్ పోటీదారుల జాబితాలో లేదు.

2025 సీజన్ ప్రారంభంలో వరుస విజయాలతో ఫేవరెట్‌గా కనిపించినప్పటికీ, చివర్లో ఫామ్ కోల్పోయింది.

మొదటి ఆరు మ్యాచ్‌ల్లో ఐదు గెలిచిన జట్టు, తరువాత ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలకే పరిమితమైంది.

దీంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేదు.

వివరాలు

జట్టులో మార్పులు - కొత్త ఆశలు

గత సీజన్‌లో స్థిరంగా ఆడలేకపోయిన ఢిల్లీ, ఈసారి కొన్ని కీలక మార్పులు చేసింది.

డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ వంటి బ్యాటర్లను వదిలేసి, వేలంలో డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్, నిశాంక, ఎంగిడి వంటి ఆటగాళ్లను తీసుకుంది.

అలాగే రాజస్థాన్ రాయల్స్ నుంచి నితీశ్ రాణాను జట్టులోకి చేర్చుకుంది.

అయితే జట్టు ప్రధానంగా కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, స్టబ్స్, కుల్‌దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్ చుట్టూ నిర్మితమై ఉంది.

బలమైన దేశీ, విదేశీ ఆటగాళ్ల సమ్మేళనంతో ఈసారి జట్టు మరింత సమతూకంగా కనిపిస్తోంది.

ఏప్రిల్ 1న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌తో దిల్లీ తన టైటిల్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది.

హేమంగ్ బదాని ఈ జట్టుకు చీఫ్ కోచ్‌గా ఉన్నాడు.

ADVERTISEMENT

వివరాలు

బలాలు ఇవే..

గత సీజన్‌లో టాప్ ఆర్డర్‌లో తరచూ మార్పులు చేయడం జట్టుకు నష్టమైంది.

కానీ ఈసారి డకెట్, నిశాంకల రూపంలో మంచి ఓపెనింగ్ జంట ఉంది.

పృథ్వీ షా కూడా ఎంపికకు సిద్ధంగా ఉన్నాడు.

మూడో స్థానంలో కేఎల్ రాహుల్ లాంటి స్థిరమైన బ్యాటర్ ఉండటం పెద్ద ప్లస్.

మిడిల్ ఆర్డర్‌లో మిల్లర్, స్టబ్స్, అశుతోష్ శర్మ వంటి పవర్ హిటర్లు ఉండటం జట్టుకు బలం.

అయితే ఢిల్లీ ప్రధాన బలం బౌలింగ్ విభాగమే. మిచెల్ స్టార్క్, కుల్‌దీప్ యాదవ్, ఎంగిడి, నటరాజన్ వంటి వికెట్ టేకర్లు జట్టులో ఉన్నారు.

వీరికి తోడు కశ్మీర్‌కు చెందిన యువ ఆటగాడు ఆకిబ్ నబి కూడా మంచి ప్రతిభ చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు.

ADVERTISEMENT

వివరాలు

బలహీనతలు ఇవే..

ఓపెనింగ్ విభాగం పేపర్‌పై బలంగా కనిపించినా, ఖచ్చితమైన మొదటి ఎంపిక జంట ఇంకా స్థిరపడలేదు.

డకెట్, నిశాంక, పృథ్వీ షా ముగ్గురూ అస్థిర ఫామ్‌తోనే టోర్నీలోకి అడుగుపెడుతున్నారు.

పేస్ బౌలింగ్ విషయంలో జట్టు ఎక్కువగా విదేశీ ఆటగాళ్లపైనే ఆధారపడుతోంది.

స్టార్క్ లేదా ఎంగిడి అందుబాటులో లేకపోయినా, లేదా ఫామ్ కోల్పోయినా జట్టు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.

అప్పుడు దేశీయ ఫాస్ట్ బౌలర్లపై ఒత్తిడి పెరుగుతుంది.

గత సీజన్‌లో ముకేశ్ కుమార్ డెత్ ఓవర్లలో స్థిరంగా బౌలింగ్ చేయలేకపోయాడు.

కొత్తగా వచ్చిన ఆకిబ్ నబి తన దేశవాళీ ఫామ్‌ను ఐపీఎల్‌లో కొనసాగించలేకపోతే జట్టు దెబ్బతినవచ్చు.

ఈసారి ఆ సమస్యలను ఎలా అధిగమిస్తుందో చూడాలి.

ADVERTISEMENT