LOADING...
IPL 2026 : ఐపీఎల్‌లో 6 డేంజరస్ రికార్డులు.. 2026లో ఐదు బ్రేక్.. ఒకటి మాత్రం టఫ్!
ఐపీఎల్‌లో 6 డేంజరస్ రికార్డులు.. 2026లో ఐదు బ్రేక్.. ఒకటి మాత్రం టఫ్!

IPL 2026 : ఐపీఎల్‌లో 6 డేంజరస్ రికార్డులు.. 2026లో ఐదు బ్రేక్.. ఒకటి మాత్రం టఫ్!

వ్రాసిన వారు Moogati Shabari
Mar 22, 2026
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ప్రారంభం కానుంది. ప్రతి సీజన్‌లాగే ఈసారి కూడా కొత్త రికార్డులు నమోదవుతాయి. పాత రికార్డులు బద్దలవుతాయి. కానీ ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు నిలకడగా కొనసాగుతున్న కొన్ని అద్భుత రికార్డులు ఉన్నాయి. వాటిలో మొత్తం ఆరు ముఖ్యమైనవి ఉండగా, అందులో ఐదు ఈ సీజన్‌లో బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఒక రికార్డు మాత్రం దాదాపు చెదరని గోడలా కనిపిస్తోంది.

వివరాలు

కోహ్లీ భారీ రికార్డు.. ఇంకా అందని ఎత్తు

ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. 2016 సీజన్‌లో ఆయన 973 పరుగులు చేసి ఈ ఘనత సాధించాడు. దాదాపు పదేళ్లుగా ఈ రికార్డు ఎవరూ చేరుకోలేకపోయారు. 2026లో ఇది బద్దలవుతుందా అన్నది అనుమానంగానే ఉంది. అతి పిన్న వయసులో సెంచరీ - దాదాపు అసాధ్యం: ఐపీఎల్‌లో అత్యంత చిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. కేవలం 14 ఏళ్లకే ఈ ఘనత సాధించాడు. 2026 సీజన్‌లో ఈ రికార్డు బ్రేక్ అవడం అసాధ్యమే. ఎందుకంటే ప్రస్తుతం ఆడుతున్న వారిలో అతనే చిన్న వయస్కుడు. ఇక 2026 ప్రారంభానికి అతనికి 15 ఏళ్లు నిండిపోతాయి.

వివరాలు

గేల్ 175 - బద్దలయ్యే అవకాశముందా?

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు 175 పరుగులు. ఈ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. ఆర్‌సీబీ తరపున ఆడుతూ అతను ఈ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం ఉన్న ఆగ్రెసివ్ బ్యాటింగ్ స్టైల్‌ను బట్టి చూస్తే, 2026లో ఈ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ కూడా ఈ రికార్డును టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

వివరాలు

అత్యధిక ఛేజ్ - మరింత పెరుగుతుందా?

ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యధికంగా ఛేజ్ చేసిన స్కోరు 262 పరుగులు. దీనిని పంజాబ్ కింగ్స్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ పై సాధించింది. తాజా బ్యాటింగ్ ట్రెండ్‌ను చూస్తే, ఇంకా పెద్ద లక్ష్యాలను ఛేజ్ చేసే అవకాశం 2026లో ఉంది. అత్యల్ప స్కోరు - ఎప్పుడైనా బ్రేక్ అవుతుందా? ఐపీఎల్‌లో అత్యల్ప స్కోరు 49 పరుగులు. ఇది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ పై నమోదైంది. ఈ రికార్డు కూడా పూర్తిగా తిరగరాయలేరని చెప్పలేం. ఒక రోజు ఏ జట్టుకైనా అలాంటి అనుభవం ఎదురైతే, దీనికంటే తక్కువ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది.

Advertisement

వివరాలు

ఒకే ఓవర్‌లో 37 పరుగులు - ప్రమాదంలో రికార్డు

ఐపీఎల్‌లో ఒకే ఓవర్‌లో అత్యధికంగా 37 పరుగులు నమోదయ్యాయి. ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో బ్యాట్స్‌మెన్ దూకుడు పెరిగిన నేపథ్యంలో, ఈ రికార్డు కూడా 2026లో బద్దలయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్ అంటే రికార్డుల పండుగ. ప్రతి సీజన్‌లో ఏదో ఒక చరిత్ర రికార్డు అవుతుంది. ఈసారి కూడా ఐదు రికార్డులు బద్దలయ్యే అవకాశాలు ఉన్నా, అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన రికార్డు మాత్రం అందనంత దూరంలో కనిపిస్తోంది.

Advertisement