LOADING...
Nicholas Pooran: లక్నో జట్టుకు భారీ షాక్.. పూరన్ మరోసారి నిరాశ
లక్నో జట్టుకు భారీ షాక్.. పూరన్ మరోసారి నిరాశ

Nicholas Pooran: లక్నో జట్టుకు భారీ షాక్.. పూరన్ మరోసారి నిరాశ

వ్రాసిన వారు Moogati Shabari
Apr 15, 2026
10:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్‌లో నికోలస్ పూరన్ నిరాశాజనక ఫామ్ కొనసాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఎడమచేతి బ్యాటర్ మరోసారి విఫలమయ్యాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోని 23వ మ్యాచ్‌లో బెంగళూరు జట్టుపై పూరన్ కేవలం 7 బంతుల్లో 1 రన్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఎల్ఎస్జీ స్కోరు 33/1 వద్ద ఉన్న సమయంలో పూరన్ క్రీజులోకి వచ్చాడు. అంతకుముందు కెప్టెన్ రిషబ్ పంత్, జోస్ హెజిల్ వుడ్ వేసిన ఓవర్లో గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెళ్లాల్సి వచ్చింది.

వివరాలు

నిరాశజనకంగా పూరన్ ప్రదర్శన

ఆత్మవిశ్వాసంతో కనిపించని పూరన్, హేజిల్‌వుడ్, రిషిక్ సలీమ్ దర్ బౌలింగ్‌లో వరుసగా ఐదు డాట్ బాల్స్ ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఆరో బంతికి ఒక సింగిల్ సాధించాడు. అయితే 7వ ఓవర్ తొలి బంతికే హేజిల్‌వుడ్ వేగానికి తట్టుకోలేక పూరన్ అవుట్ అయ్యాడు. ఈ సీజన్‌లో పూరన్ ప్రదర్శన చూస్తే నిరాశకరంగానే ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ పై జరిగిన తొలి మ్యాచ్‌లో 8 బంతుల్లో 8 పరుగులు చేశాడు. ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ పై 4 బంతుల్లో 1 రన్ మాత్రమే సాధించాడు.

వివరాలు

పూరన్ రికార్డులివే..

కోల్‌కతా నైట్ రైడర్స్ పై 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత గుజరాత్ టైటాన్స్ పై 19 పరుగులు చేశాడు. తాజాగా డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఆర్సీబీపై మళ్లీ 7 బంతుల్లో 1 రన్‌కే పరిమితమయ్యాడు. మొత్తం ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన పూరన్, కేవలం 42 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 8.40గా ఉండగా, స్ట్రైక్ రేట్ 76.36గా ఉంది. మొత్తం 55 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం మూడు సిక్సర్లు, ఒక ఫోర్ మాత్రమే బాదడం గమనార్హం. ప్రస్తుతం అతని ఫామ్ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది.

Advertisement