Raghu Sharma : 15 ఏళ్ల నిరీక్షణకు ఫుల్‌స్టాప్.. జై శ్రీరామ్ నోట్‌తో రఘు శర్మ సెలబ్రేషన్
ఈ వార్తాకథనం ఏంటి
33 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో తొలి వికెట్ సాధించిన రఘు శర్మ భావోద్వేగానికి లోనై ప్రత్యేకంగా సంబరాలు జరుపుకున్న ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం ముంబయి ఇండియన్స్ , లక్నో సూపర్జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ముంబై జట్టుకు చెందిన లెగ్ స్పిన్నర్ రఘు శర్మ, తన ఐపీఎల్ కెరీర్‌లో మొదటి వికెట్ తీసుకొని ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఈ సందర్భంలో అతను తన జేబులో నుంచి ఒక నోట్ తీసి ప్రేక్షకులకు చూపిస్తూ భావోద్వేగంగా స్పందించాడు. ఆ దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
వివరాలు
ఐపీఎల్‌లో తొలి వికెట్..
లక్నో ఇన్నింగ్స్‌లో 13వ ఓవర్‌లో ఈ కీలక ఘట్టం జరిగింది. ఆ ఓవర్‌ను రఘు శర్మ వేస్తుండగా, మొదటి బంతికి లక్నో బ్యాటర్ అక్షత్ రఘువంశీ (11) షాట్ ఆడాడు. బంతి బ్యాట్‌ను తాకి ప్యాడ్‌ను తాకుతూ గాల్లోకి లేచింది. వెంటనే స్పందించిన రఘు శర్మ రిటర్న్ క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో అతని ఐపీఎల్ తొలి వికెట్ నమోదైంది. 15 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ క్షణం సాధించడంతో అతని ఆనందానికి హద్దులు లేకపోయాయి.
వివరాలు
ఎమోషనల్ అయిన రఘు శర్మ..
ముందుగానే సిద్ధం చేసుకుని జేబులో పెట్టుకున్న నోట్‌ను బయటకు తీసి చూపించాడు. అందులో "గురువుల ఆశీర్వాదంతో 15 ఏళ్ల దీర్ఘమైన, కష్టమైన ప్రయాణం ఈరోజుతో ముగిసింది. నాకు అవకాశం ఇచ్చిన ముంబై జట్టుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. జై శ్రీరామ్" అని రాసి ఉంది. రఘు శర్మ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో వికెట్లు తీయకపోయినా నాలుగు ఓవర్లలో కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తాజా లక్నో మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి 36 పరుగులు ఇచ్చి ఒక వికెట్ సాధించాడు. ముంబై బౌలర్లు 10కు పైగా ఎకానమీతో పరుగులు ఇచ్చినప్పటికీ, రఘు మాత్రం 9 ఎకానమీతో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న రఘు శర్మ వీడియో ఇదే..
#RaghuSharma makes a statement with that wicket 🔥
— Star Sports (@StarSportsIndia) May 4, 2026
Years of hard work and belief are finally paying off. 💙🙌🏻#TATAIPL Revenge Week 2026 ➡️ #MIvLSG | LIVE NOW 👉https://t.co/hc4PVkY1Pc pic.twitter.com/QFbQB1OeRg