తదుపరి వార్తా కథనం
IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం.. కొత్తగా 35 పేర్లు.. 350 మంది జాబితా విడుదల
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 09, 2025
04:27 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 మినీ వేలంలో పాల్గొనేందుకు మొత్తం 1,355 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, వేలానికి అర్హులైన క్రికెటర్ల జాబితాను బీసీసీఐ అధికారికంగా విడుదల చేసింది. ఈసారి 350 మంది ఆటగాళ్లు మాత్రమే ఫ్రాంచైజీలకు అందుబాటులో ఉండగా, డిసెంబర్ 16న అబుదాబిలో మధ్యాహ్నం 2.30 గంటలకు మినీ వేలం జరగనుంది. ఫ్రాంచైజీలతో సవ్యంగా చర్చలు జరిపిన అనంతరం బీసీసీఐ ఈ తుది జాబితాను ప్రకటించింది. ప్రత్యేకంగా, గత జాబితాలో లేని 35 కొత్త ఆటగాళ్ల పేర్లు ఈసారి చేర్చడం గమనార్హం. దీంతో, మొత్తం 350 మంది ప్లేయర్ల పూర్తి జాబితా సిద్ధమైంది. ఇప్పుడు ఆ తాజా జాబితాను ఓసారి పరశీలిద్దాం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఫుల్ లిస్ట్ ఇదే
🚨 TOTAL 350 PLAYERS IN IPL 2026 AUCTION 🚨 pic.twitter.com/rAsIIfYGJ2
— Tanuj (@ImTanujSingh) December 9, 2025