LOADING...
IPL 2026 Auction: రేపే ఐపీఎల్‌ 2026 మినీ వేలం.. అబుదాబిలో హోరాహోరీ బిడ్డింగ్!
రేపే ఐపీఎల్‌ 2026 మినీ వేలం.. అబుదాబిలో హోరాహోరీ బిడ్డింగ్!

IPL 2026 Auction: రేపే ఐపీఎల్‌ 2026 మినీ వేలం.. అబుదాబిలో హోరాహోరీ బిడ్డింగ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 15, 2025
11:38 am

ఈ వార్తాకథనం ఏంటి

2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేలానికి సిద్ధత పూర్తి అయ్యింది. డిసెంబర్ 16న అబుదాబిలోని ఎతిహాద్ స్టేడియంలో పది ఐపీఎల్ ఫ్రాంచైజీలు హోరాహోరీ బిడ్డింగ్‌లో పాల్గొననుండగా, ఈ మినీ వేలంలో అనేక అగ్రశ్రేణి దేశీ, విదేశీ క్రికెటర్లు అందుబాటులో ఉండటం వల్ల జట్ల వ్యూహాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఈ వేలంలో మొత్తం రూ.237.55 కోట్ల పర్స్ అందుబాటులో ఉంది, దీని ద్వారా 77 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. మొత్తం 359 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. అందులో 110 మంది విదేశీ ఆటగాళ్లు. ఒక్కో జట్టు గరిష్టంగా 31 మంది విదేశీ ఆటగాళ్లను మాత్రమే తీసుకోవచ్చు.

Details

అవసరాలను బట్టి వ్యూహాత్మక అడుగులు

జట్లు తమ మిగిలిన పర్స్, ఖాళీ స్లాట్లు, జట్టు అవసరాలను బట్టి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వద్ద రూ.64.30 కోట్ల పర్స్ ఉంది. 13 స్లాట్లు ఖాళీగా ఉండటంతో విదేశీ ఆల్‌రౌండర్లు, ఓపెనర్లు, పేసర్ల కోసం KKR దూకుడుగా బిడ్ వేయవచ్చు. ముఖ్యంగా కామెరాన్ గ్రీన్ కోసం భారీ ప్రయత్నం చూపవచ్చని అంచనా. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వద్ద రూ.43.40 కోట్ల పర్స్ ఉంది. రవీంద్ర జడేజా రిటైర్మెంట్ తర్వాత, లోయర్ ఆర్డర్ ఫినిషర్ లేదా ఆల్‌రౌండర్ కోసం జట్టు చూస్తోంది. ముఖ్యంగా లియామ్ లివింగ్‌స్టోన్ ను టార్గెట్‌గా పెట్టి, స్పిన్ విభాగంలో కొత్త ఆటగాళ్లను తీసుకురావడంపై దృష్టి పెట్టింది.

Details

హైదరాబాద్ వద్ద రూ.25.50 కోట్ల పర్స్

సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ.25.50 కోట్ల పర్స్ ఉంది. జట్టు ఇండియన్ పేసర్, నాణ్యమైన స్పిన్నర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కోసం ప్రయత్నిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా బ్యాకప్ పేసర్లు, ఓపెనర్లు, స్పిన్నర్లపై దృష్టి సారించాయి. ముఖ్యంగా ఢిల్లీలో విదేశీ ఓపెనర్, మిచెల్ స్టార్క్‌కు బ్యాకప్ పేసర్ అవసరం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ తమ పరిమిత పర్స్‌ను జాగ్రత్తగా వినియోగించి కీలక స్థానాలను భర్తీ చేయాలని చూస్తున్నాయి.

Advertisement

Details

ముంబై ఇండియన్స్ వద్ద కేవలం రూ.2.75 కోట్లు

ముంబై ఇండియన్స్ వద్ద కేవలం రూ.2.75 కోట్లే మిగిలి ఉండటంతో తక్కువ ధరలో బ్యాకప్ ఆటగాళ్లను తీసుకునే అవకాశం ఉంది. ఈ వేలంలో రవి బిష్ణోయ్, లియామ్ లివింగ్‌స్టోన్, కామెరాన్ గ్రీన్ వంటి ఆటగాళ్లకు భారీ డిమాండ్ ఉండనుంది. అలాగే క్వింటన్ డి కాక్, బెన్ డకెట్, మతీశ పతిరానా, అన్రిచ్ నార్ట్జే వంటి విదేశీ ఓపెనర్లు, పేసర్లు జట్ల ప్రధాన టార్గెట్‌లలో ఉన్నారు. మొత్తంగా IPL 2026 మినీ వేలం అబుదాబిలో రసవత్తరంగా సాగనుందని అంచనా.

Advertisement