Hardik pandya: ఒక్కరితో కాదు భయ్యో… మొత్తం ఏడుగురితో ప్రేమ కథలు..పాండ్యా మామూలోడు కాదు!
ఈ వార్తాకథనం ఏంటి
భారత జట్టులో స్టార్ ఆల్‌రౌండర్‌గా పేరుగాంచిన హర్థిక్ పాండ్యా, మైదానంలో తన దూకుడు ఆటతో ప్రత్యర్థులను భయపెట్టడమే కాకుండా, తన వ్యక్తిగత జీవితంతో కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. నటాషా స్టాంకోవిచ్‌తో విడిపోయిన తర్వాత, హార్దిక్ డేటింగ్ లైఫ్ మళ్లీ చర్చనీయాంశంగా మారింది. గ్లామర్ ఇండస్ట్రీకి చెందిన ఏడుగురు మహిళలతో ఆయనకు సంబంధించిన ప్రేమ వ్యవహారాలు నడుస్తున్నాయనే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
వివరాలు
నెట్టింట దుమారం..
నటాషాతో వివాహ జీవితం ముగిసిన తర్వాత, 2026లో ఆయన కొత్త రిలేషన్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హార్దిక్ కెరీర్ ప్రారంభ దశలోనే కొందరు మోడల్స్‌తో సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కోల్‌కతాకు మోడల్ లీషా శర్మతో ఆయన సన్నిహిత సంబంధం ఉన్నట్లు 2016లో ఫోటోలు వైరలయ్యాయి. అయితే ఆమె ఫ్రెండ్ మాత్రమేనని చెప్పారు. ఆ తరువాత స్వీడిష్ నటి ఎల్లి అవ్రామ్, అలాగే ఈషా గుప్తాతో కూడా ఆయన లవ్‌లో ఉన్నాడని టాక్ వినిపించింది. హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్యా పెళ్లికి హాజరవడంతో వీరి మధ్య ప్రత్యేక సంబంధం ఉందని అందరూ మాట్లాడుకున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాతో కూడా ఆయన లింక్-అప్ వార్తలు ఒకప్పుడు సంచలనం సృష్టించాయి.
వివరాలు
బ్రిటిష్ సింగర్‌తో ఫోటోలు వైరల్
హార్దిక్ జీవితంలో పెద్ద మలుపు 2019లో వచ్చింది. ఆ సమయంలో సెర్బియన్ మోడల్ నటాషా స్టాంకోవిచ్‌తో ప్రేమలో పడిన ఆయన, 2020లో సముద్ర మధ్యలో ప్రత్యేకంగా ప్రపోజ్ చేసి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు అగస్త్య అనే కుమారుడు కూడా ఉన్నాడు. కానీ, అనూహ్యంగా 2024 జూలైలో వీరిద్దరూ విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రస్తుతం నటాషా తన దేశానికి వెళ్లిపోగా, హార్దిక్ మళ్లీ సింగిల్‌గా మారాడు. విడాకుల తర్వాత హార్దిక్ జీవితంలో మరో కొత్త దశ ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. బ్రిటిష్ సింగర్ జాస్మిన్ వాలియాతో కలిసి ఆయన గ్రీస్‌కు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వివరాలు
కొత్త లైఫ్ స్టార్ట్..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమయంలో కూడా జాస్మిన్ కనిపించడం చర్చకు దారితీసింది. అయితే, 2026 మార్చిలో మరో కొత్త మలుపు తిరిగినట్లు సమాచారం. ప్రస్తుతం హార్దిక్, మోడల్ మాహికా శర్మతో గాఢమైన ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మాహికా, మైదానంలో హార్దిక్ పక్కనే కనిపించడం విశేషం. అంతేకాకుండా, ఆమె కోసం హార్దిక్ ప్రత్యేకంగా ఒక టాటూ వేయించుకున్నాడని, అలాగే ఆయన తల్లితో కూడా మాహికాకు మంచి అనుబంధం ఏర్పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో హార్దిక్ షేర్ చేస్తున్న పోస్టులను పరిశీలిస్తే, ఆయన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని స్పష్టంగా అర్థమవుతోంది.