IPL 2026: పంజాబ్‌ను దించి టాప్‌లోకి ఆరెంజ్ ఆర్మీ.. ఆర్సీబీకి షాక్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనతో టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్‌ను ఓడించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ప్లే ఆఫ్స్ సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఆరెంజ్ ఆర్మీ చూపించిన పోరాట స్పూర్తి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పంజాబ్ కింగ్స్‌పై కీలక విజయంతో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరింది. ఈ సీజన్‌లో తొలిసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ అగ్రస్థానంలో నిలవడం విశేషం. ప్రారంభ నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించిన ఈ జట్టు, అనంతరం జరిగిన ఏడు మ్యాచ్‌లలో ఆరు విజయాలు నమోదు చేసింది.
వివరాలు
ప్లే ఆఫ్స్‌కు చేరేది ఎవరు?
ముఖ్యంగా వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి అద్భుత ఫామ్‌ను ప్రదర్శించింది. పంజాబ్‌పై గెలుపుతో మొత్తం 14 పాయింట్లు సాధించి టాప్ ప్లేస్‌ను అందుకుంది. మరోవైపు, సీజన్ ప్రారంభం నుంచి అగ్రస్థానంలో కొనసాగిన పంజాబ్ కింగ్స్ తొలిసారి రెండో స్థానానికి పడిపోయింది. ఇప్పటివరకు పది మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు ఆరు విజయాలు, మూడు పరాజయాలతో 13 పాయింట్లు సంపాదించింది. సన్‌రైజర్స్ విజయం కారణంగా రెండో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడో స్థానానికి జారిపోయింది. రాజస్థాన్ రాయల్స్ మాత్రం నాలుగో స్థానాన్ని కొనసాగిస్తోంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్న గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు కూడా వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాయి.
వివరాలు
ఆఖరి స్థానంలో లక్నో..
గుజరాత్ టైటాన్స్ పది మ్యాచ్‌లలో ఆరు విజయాలు సాధించి 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. మూడో నుంచి ఐదో స్థానాల వరకు ఉన్న మూడు జట్లు సమానంగా 12 పాయింట్లు కలిగి ఉండటం ఆసక్తికరంగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్ ఐదు విజయాలతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ వరుస పరాజయాలతో ఒక్కసారిగా ఏడో స్థానానికి పడిపోయింది. పది మ్యాచ్‌లలో నాలుగు విజయాలు సాధించిన ఢిల్లీ ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ , ముంబయి ఇండియన్స్ తలో మూడు విజయాలతో ఎనిమిదో, తొమ్మిదో స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం కేవలం రెండు విజయాలతో పట్టికలో చివరి స్థానానికి పరిమితమైంది.