IPL 2026: ఢిల్లీపై ప్రియాంశ్ ఆర్య మెరుపు హాఫ్‌సెంచరీ.. ఈ సీజన్‌లో మూడో అర్ధశతకం
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన 55వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య అద్భుతంగా రాణించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 24 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 33 బంతులు ఎదుర్కొన్న అతడు 56 పరుగులు చేసి ఔటయ్యాడు. తన ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 6 భారీ సిక్సర్లు బాదాడు. మ్యాచ్ తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన ప్రియాంశ్ తన దూకుడు ఏంటో చూపించాడు. ఆ ఓవర్‌లో మిచెల్ స్టార్క్ 21 పరుగులు ఇచ్చాడు. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రియాంశ్, ప్రభసిమ్రన్ సింగ్'తో కలిసి తొలి వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
వివరాలు
800కు పైగా పరుగులు సాధించిన ప్రియాంశ్
పవర్‌ప్లేలో పంజాబ్ వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ప్రియాంశ్‌కు ఇది మూడో అర్ధశతకం కాగా, ఐపీఎల్ కెరీర్‌లో ఐదో ఫిఫ్టీగా నిలిచింది. 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అతడు ఇప్పటివరకు 27 మ్యాచ్‌ల్లో 800కు పైగా పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు ఐదు అర్ధశతకాలు ఉన్నాయి. అతడి అత్యధిక స్కోరు 103 పరుగులు.