LOADING...
Venkatesh Iyer: వెంకటేశ్ అయ్యర్‌ను రూ. 7 కోట్లకు దక్కించుకున్న ఆర్‌సీబీ 
వెంకటేశ్ అయ్యర్‌ను రూ. 7 కోట్లకు దక్కించుకున్న ఆర్‌సీబీ

Venkatesh Iyer: వెంకటేశ్ అయ్యర్‌ను రూ. 7 కోట్లకు దక్కించుకున్న ఆర్‌సీబీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 16, 2025
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

అబుదాబి వేదికగా జరిగే ఐపీఎల్ 2026 మినీ వేలంలో భారత ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. ఆయన కోసం జట్టు రూ. 7 కోట్లను ఖర్చు చేసింది. గత మెగా వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) వెంకటేశ్ అయ్యర్‌ను రూ. 23.75 కోట్ల భారీ ధరలో కొనుగోలు చేసిన సంగతి గుర్తుంచుకోవాల్సింది. అయితే, ఈ మినీ వేలానికి ముందు కేకేఆర్ అతడిని రిలీజ్ చేయడం వల్ల వెంకటేశ్ అయ్యర్ మళ్లీ వేలం జాబితాలోకి వచ్చాడు. దీంతో ఆర్‌సీబీ ఆయనపై ఆసక్తి చూపి పోటీపడి సొంతం చేసుకుంది. గత కంటే ఈసారి ఆయన ధర గణనీయంగా తగ్గిన విషయం గమనార్హం.

వివరాలు 

మిల్లర్, బెన్ డకెట్‌లను కొనుగోలు చేసిన ఢిల్లీ 

ఇలాంటి పరిస్థితుల్లో, ఈ మినీ వేలంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారీ ధర రావచ్చని అంచనా వేసిన దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు క్వింటన్ డికాక్‌ను ముంబై ఇండియన్స్ కేవలం రూ. 1 కోటి బేస్ ప్రైస్‌లో కొనుగోలు చేసింది. శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగను లక్నో జట్టు రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది. అలాగే, ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డకెట్, దక్షిణాఫ్రికా హిట్టర్ డేవిడ్ మిల్లర్‌లను ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒక్కొక్కరికి రూ. 2 కోట్లలో కొనుగోలు చేసింది.

Advertisement