LOADING...
IPL 2026: ఐపీఎల్‌లో హాట్ ఫైట్‌.. శుభ్‌మన్ vs శ్రేయస్
ఐపీఎల్‌లో హాట్ ఫైట్‌.. శుభ్‌మన్ vs శ్రేయస్

IPL 2026: ఐపీఎల్‌లో హాట్ ఫైట్‌.. శుభ్‌మన్ vs శ్రేయస్

వ్రాసిన వారు Moogati Shabari
Mar 31, 2026
10:40 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌-19 సీజన్‌లో మరో రసవత్తర సమరానికి వేదిక సిద్ధమైంది. మంగళవారం జరిగే ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు గుజరాత్ టైటాన్స్‌ను ఎదుర్కోనుంది. ఈ పోరులో పంజాబ్ సారథి శ్రేయస్ అయ్యర్, గుజరాత్ నాయకుడు శుభమన్ గిల్‌పై ప్రత్యేక దృష్టి నెలకొంది. భారత టీ20 జట్టులో ప్రస్తుతం చోటు దక్కని ఈ ఇద్దరు ప్రముఖ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఎలా మెరుగైన ప్రదర్శన చేస్తారో చూడాల్సి ఉంది. గత సీజన్‌లో శ్రేయస్ నాయకత్వంలో ఫైనల్‌ వరకు చేరి చివరి దశలో పరాజయం చెందిన పంజాబ్ జట్టు, ఈసారి ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. జట్టుకు విజయాలు అందించాలంటే బ్యాటర్‌గా కూడా శ్రేయస్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది.

వివరాలు

ఈసారైనా గెలుపు సాధ్యమేనా?

గత ఏడాది అతను 50కుపైగా సగటుతో మొత్తం 604 పరుగులు సాధించాడు. ఈ ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో పాల్గొన్నప్పటికీ, టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన భారత జట్టులో అతనికి స్థానం లభించలేదు. ఇక గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే, 2022లో తమ తొలి సీజన్‌లోనే ట్రోఫీ గెలుచుకుని, తదుపరి ఏడాది రన్నరప్‌గా నిలిచిన ఈ జట్టు ఆ తర్వాత అదే స్థాయి ప్రదర్శన కొనసాగించలేకపోయింది. హర్దిక్ పాండ్యా ముంబయి జట్టుకు మారిన తర్వాత 2024లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు.

వివరాలు 

గిల్‌పైనే అందరి చూపు..

గత సీజన్‌లో అతని నాయకత్వంలో గుజరాత్ జట్టు మంచి ప్రదర్శన కనబరిచి ప్లేఆఫ్స్‌కి చేరుకుంది. అయినప్పటికీ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిపోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. బ్యాటర్‌గా శుభ్‌మన్ స్థిరంగా రాణిస్తున్నప్పటికీ, అతని స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి. టీ20 కెరీర్‌లో 138 స్ట్రైక్‌రేట్ కలిగిన అతను, గత ఐపీఎల్ సీజన్‌లో 15 మ్యాచ్‌ల్లో 155 స్ట్రైక్‌రేట్‌తో 650 పరుగులు నమోదు చేశాడు. భారత టీ20 జట్టులో స్థానం దక్కించుకోవాలంటే అతను ఇంకా వేగంగా ఆడాల్సిన అవసరం ఉంది.

Advertisement