LOADING...
IPL 2026 : ఐపీఎల్ 2026లో కొత్త స్టార్లు..అందరి చూపు ఈ యువ ఆటగాళ్లపైనే
ఐపీఎల్ 2026లో కొత్త స్టార్లు..అందరి చూపు ఈ యువ ఆటగాళ్లపైనే

IPL 2026 : ఐపీఎల్ 2026లో కొత్త స్టార్లు..అందరి చూపు ఈ యువ ఆటగాళ్లపైనే

వ్రాసిన వారు Moogati Shabari
Mar 25, 2026
03:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి సీజన్‌లాగానే ఈసారి కూడా వేలంలో భారీ మొత్తాలకు కొనుగోలు అయిన అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు, అలాగే అండర్-19 వరల్డ్ కప్‌లో ప్రతిభ చూపిన యువ క్రికెటర్లపై ప్రత్యేక దృష్టి పడింది. సీఎస్‌కే, ముంబయి, ఆర్సీబీ వంటి ప్రముఖ జట్లు భవిష్యత్తు స్టార్‌లను గుర్తించేందుకు ముందుకొచ్చాయి. ఇంకా మైదానంలో అడుగుపెట్టకముందే తమ సామర్థ్యాన్ని చూపించిన ఐదుగురు ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు ఈ సీజన్‌లో అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నారు. వీరిలో ఎవరు అంచనాలకు తగ్గట్టు రాణిస్తారు? ఎవరు తమ జట్ల గమనాన్ని మార్చగలరు? అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించిన ఆ ఆటగాళ్లు ఎవరు? వారు ఏ జట్లకు ప్రాతినిధ్యం వహించబోతున్నారు? తెలుసుకుందాం.

వివరాలు 

సీఎస్‌కేకు దొరికిన ప్రతిభావంతులు వీరే

రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల వికెట్‌కీపర్-బ్యాటర్ కార్తీక్ శర్మను చెన్నై సూపర్ కింగ్స్ 14.2 కోట్ల రూపాయల భారీ మొత్తంతో దక్కించుకోవడం విశేషం. అతను మంచి ఫీల్డర్ మాత్రమే కాకుండా, టాప్ ఆర్డర్‌లో దూకుడుగా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం కలవాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలో బౌలర్లపై ఆధిపత్యం చెలాయించడంలో అతను ప్రత్యేకం. ధోనీ తర్వాత జట్టుకు వారసుడిగా ఎదగగల అవకాశమున్న ఈ యువ ఆటగాడు, ధోనీ విశ్రాంతి తీసుకుంటే వికెట్‌కీపర్‌గా బాధ్యతలు చేపడతాడు. లేకపోతే ఫీల్డింగ్‌లోనూ తన ప్రతిభను చూపగలడు.

వివరాలు 

జడేజాకు వారసుడు అతనేనా?

ప్రశాంత్ వీర్ కూడా సీఎస్‌కే కొనుగోలు చేసిన మరో ముఖ్యమైన ఆటగాడు. ఇతనిని కూడా రూ.14.20 కోట్లకు సొంతం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్‌రౌండర్‌ను రవీంద్ర జడేజాకు సరైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. డొమెస్టిక్ టీ20ల్లో 170 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేస్తూనే, క్రమబద్ధమైన బౌలింగ్ చేయగలడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ ప్రభావం చూపగల ఈ ఆటగాడు జట్టుకు వ్యూహాత్మకంగా కీలకంగా మారే అవకాశం ఉంది.

Advertisement

వివరాలు 

ఢిల్లీ జట్టుకు ఆయుధం ఎవరంటే..

జమ్మూ-కాశ్మీర్ నుంచి వచ్చిన ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ దార్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.8.40 కోట్లకు కొనుగోలు చేసింది. వేలం సమయంలోనే అతను అందరి దృష్టిని ఆకర్షించాడు. రంజీ ట్రోఫీలో కశ్మీర్ జట్టు విజయంలో అతని పాత్ర కీలకం. ఆ టోర్నీలో 60 వికెట్లు తీసి తన ప్రతిభను చాటాడు. గంటకు 140 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతిని స్వింగ్ చేయగల సామర్థ్యం అతనిది. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడంలో అతను నిపుణుడు. అతని బౌలింగ్‌ను ప్రత్యర్థులు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Advertisement

వివరాలు 

ఆర్సీబీ ఆశలు పెట్టుకున్న యువ బ్యాటర్

18 ఏళ్ల విహాన్ మల్హోత్రాపై ఆర్సీబీ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. అండర్-19 వరల్డ్ కప్‌లో సెంచరీతో మెప్పించిన అతను మంచి గుర్తింపు పొందాడు. ఒత్తిడిలోనూ స్టైలిష్‌గా ఆడగల అతని శైలి చాలామందిని ఆకట్టుకుంది. కొందరు అతన్ని శుభ్‌మన్ గిల్‌తో పోలుస్తున్నారు. కేవలం రూ.30 లక్షలకు దక్కినా, టాప్ ఆర్డర్‌లో స్థిరంగా రాణించే సామర్థ్యం అతనిలో ఉంది. అవసరమైతే విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం కూడా ఉంది.

వివరాలు 

ముంబయి జట్టు కోరుకున్న వీరుడు

ప్రతిభను గుర్తించడంలో ముంబయి ఇండియన్స్ ఎప్పుడూ ముందుంటుంది. బీహార్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఇజార్‌ను రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 5 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. వేగవంతమైన బౌలింగ్‌తో పాటు, 7.11 ఎకానమీ రేట్‌ను కొనసాగించడం అతని ప్రత్యేకత. బుమ్రా మార్గదర్శకత్వంలో ఈ జట్టుకు అతను కీలక ఆయుధంగా మారే అవకాశముంది. అయితే ఇప్పటికే బలమైన బౌలింగ్ లైనప్ ఉన్న నేపథ్యంలో అతనికి తుది జట్టులో స్థానం దక్కుతుందా లేదా అనేది చూడాలి.

Advertisement