IPL 2026: జాక్‌పాట్ కొట్టిన అన్‌క్యాప్డ్ ప్లేయర్.. ఏకంగా 47 కోట్లు .. ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 వేలం వేదికపై అందరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్ కోసం ఫ్రాంచైజీలు అసాధారణ స్థాయిలో పోటీ పడ్డాయి. వలం రూ. 30 లక్షల కనీస ధరతో వేలానికి వచ్చిన ఈ యువ ఆటగాడు క్షణాల్లోనే రూ. 14 కోట్ల మార్కును దాటడం క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. ప్రశాంత్ వీర్ పేరు ప్రకటించగానే వేలం హాల్‌లో ఉత్కంఠ ఒక్కసారిగా పెరిగింది. లక్నో సూపర్ జెయింట్స్ మొదట బిడ్ వేసినా, వెంటనే ముంబయి ఇండియన్స్ రంగంలోకి దిగింది.
వివరాలు
ముంబై అవుట్ - చెన్నై ఇన్:
ధర రూ. 1.20 కోట్లకు చేరుకున్న దశలో ముంబై ఇండియన్స్ వెనక్కి తగ్గింది. ఆ వెంటనే చెన్నై సూపర్ కింగ్స్ బిడ్డింగ్‌లోకి అడుగుపెట్టింది. రాజస్థాన్ రాయల్స్ రంగప్రవేశం: రూ. 4.20 కోట్ల వద్ద లక్నో సూపర్ జెయింట్స్ పోటీ నుంచి నిష్క్రమించింది. అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ చెన్నైకి సవాల్ విసిరింది. హైదరాబాద్-చెన్నై మధ్య అసలైన సమరం: వేలం ఉత్కంఠకు అసలైన మలుపు ఇక్కడే వచ్చింది. ధర రూ. 6 కోట్లకు చేరుకున్న వేళ సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 6.80 కోట్లతో ఎంట్రీ ఇచ్చింది. హైదరాబాద్,చెన్నై జట్ల మధ్య తీవ్ర పోటీ కొనసాగడంతో బిడ్ మొత్తం క్రమంగా రూ. 13 కోట్లను దాటింది.
వివరాలు
ప్రశాంత్ వీర్ ఎవరు?
ఇది ఒక అన్‌క్యాప్డ్ ఆటగాడికి అరుదైన రికార్డుగా నిలిచింది. చివరికి చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14.20కోట్ల భారీ మొత్తానికి ప్రశాంత్ వీర్‌ను సొంతం చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 20ఏళ్ల ప్రశాంత్ వీర్ ఒక ప్రతిభావంతమైన స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌గా,స్లో లెఫ్ట్-ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్‌గా అతడు రాణిస్తున్నాడు. ఇటీవల జరిగిన యూపీ టీ20 లీగ్‌లో నోయిడా కింగ్స్ తరఫున ఆడిన అతడు 10 మ్యాచ్‌ల్లో 320 పరుగులు చేయడంతో పాటు 8వికెట్లు సాధించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 'జడేజా 2.0'గా గుర్తింపు ఆల్‌రౌండ్ నైపుణ్యం,ఫీల్డింగ్ చురుకుదనం,ఆట శైలి రవీంద్ర జడేజాను గుర్తు చేయడంతో ప్రశాంత్ వీర్‌ను 'జడేజా 2.0'గా పిలుస్తున్నారు.ఇదే అతనిపై ఫ్రాంచైజీల ఆసక్తి పెరగడానికి కారణమైంది.
వివరాలు
ఇంత డిమాండ్ ఎందుకు?
దేశవాళీ క్రికెట్‌లో, ముఖ్యంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో నిలకడైన ప్రదర్శన చేయడం, స్పిన్ బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో వేగంగా పరుగులు సాధించే సామర్థ్యం ఉండడం, ఇంకా కేవలం 20 ఏళ్ల వయసులోనే ఉండటం వల్ల భవిష్యత్తు పెట్టుబడిగా జట్లు భావించాయి. ఒక సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన యువ క్రికెటర్ కోసం CSK, SRH, MI, LSG వంటి ఐపీఎల్ దిగ్గజ జట్లు పోటీ పడటం అతని ప్రతిభకు నిదర్శనం. చివరకు రూ. 14.20 కోట్లకు అమ్ముడుపోవడం ఐపీఎల్ వేలాల చరిత్రలో గుర్తుండిపోయే సంఘటనగా నిలిచింది.