
బౌలింగ్ పై నమ్మకం పెంచుకున్న కోహ్లీ: 40పరుగులకే ఆలౌట్ చేసేవాడినంటూ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
మే 14వ తేదీన జరిగిన ఐపీఎల్ మ్యాచులో బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ ను 59పరుగులకే ఆలౌట్ చేసి 112పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది .
బెంగళూరు బౌలర్ల ధాటికి రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు కుదేలైపోయారు. ఐపీఎల్ చరిత్రలోనే మూడవ అత్యల్ప స్కోరును నమోదు చేసింది రాజస్థాన్ రాయల్స్ టీమ్.
ఇక మ్యాచు గెలవడంతో పాటు నెట్ రన్ రేటును పెంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్, పాయింట్ల పట్టికలో ఐదవ స్థానానికి చేరుకుని ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.
ఆ ఆనందంలో ఉన్న బెంగళూరు ఆటగాళ్ళు, రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ పై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఇందులోంచి కోహ్లీ మాటలు ఆసక్తికరంగా మారాయి.
Details
అత్యల్ప స్కోరు జాబితాలో రెండు మూడు స్థానాల్లో నిలిచిన రాజస్థాన్ రాయల్స్
తాను బౌలింగ్ చేసి ఉంటే రాజస్థాన్ టీమ్ ఆలౌట్ అయ్యేదని అన్నాడు. ఈ మాటలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. తన బౌలింగ్ మీద కోహ్లీకి నమ్మకం బాగా పెరిగిందని కామెంట్లు చేస్తున్నారు.
రాజస్థాన్ తో జరిగిన మ్యాచులో మొదట బ్యాటింగుకు దిగిన బెంగళూరు, 5వికెట్లు కోల్పోయి 171పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్, 10.3ఓవర్లలో 59పరుగులకే అల్ ఔట్ అయ్యింది.
ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోరు చేసిన రికార్డు బెంగళూరు (49 పరుగులు) పేరిట ఉంది.
ఆ తర్వాత రెండు(58పరుగులు), మూడవ స్థానాల్లో(59పరుగులు) రాజస్థాన్ రాయల్స్ ఉంది. అది కూడా బెంగళూరు మీదే కావడం విశేషం.