LOADING...
IPL 2026: రూ.25.20 కోట్లు నాశనం చేశారు కదయ్యా.. కామెరాన్ గ్రీన్ చేసిన పనికి షాక్

IPL 2026: రూ.25.20 కోట్లు నాశనం చేశారు కదయ్యా.. కామెరాన్ గ్రీన్ చేసిన పనికి షాక్

వ్రాసిన వారు Moogati Shabari
Apr 06, 2026
11:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో రూ. 25.20 కోట్ల అత్యధిక ధరకు కొన్న కామెరాన్ గ్రీన్, చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. అంత ఖరీదైన ఆటగాడు.. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆశలను నెరవేర్చడంలో విఫలమవుతున్నాడు. ఈడెన్ గార్డెన్స్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అతడు సరిగా ఆడలేకపోయాడు. ఓపెనర్ ఫిన్ అలెన్ త్వరగా అవుట్ కావడంతో గ్రీన్ క్రీజులోకి వచ్చాడు. మొదటి బంతి ఫోర్ కొట్టి మంచి ప్రారంభం ఇచ్చినా, తదుపరి బంతికి జేవియర్ బార్ట్‌లెట్ వేసిన అవుట్-స్వింగర్ బంతికి వికెట్ కీపర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి కేవలం 4 పరుగులకే అవుటయ్యాడు.

వివరాలు

గ్రీన్ బ్యాటింగ్ చూసి షాక్

ఇప్పటివరకు ఈ సీజన్‌లో గ్రీన్ మొత్తం మ్యాచ్‌లలో కేవలం 24 పరుగులు మాత్రమే సాధించాడు. 10 కంటే తక్కువ సగటుతో ఆడటం కోల్‌కతా నైట్ రైడర్స్ మేనేజ్‌మెంట్‌ కోసం పెద్ద సమస్యగా మారింది. జట్టుకు ఆల్‌రౌండర్‌గా పనికొస్తాడని భావించి భారీ ఖర్చు పెట్టి కొనుగోలు చేసినా, అతడి బౌలింగ్‌లోనూ ఎలాంటి ప్రభావం కనిపించడం లేదు. ఈ టోర్నమెంట్‌లో గ్రీన్ ఇప్పటి వరకు కేవలం ఒకే ఓవర్ బౌలింగ్ చేశాడు. అంతేకాక, గ్రీన్ గతంలో వెన్నునొప్పితో బాధపడినట్లు, వర్క్‌లోడ్ పరంగా జాగ్రత్తగా ఉండమని క్రికెట్ ఆస్ట్రేలియా కోల్‌కతా ఫ్రాంచైజీకి సూచించింది. దాంతో అతను పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయలేకపోతున్నాడు.

వివరాలు

బ్యాటింగ్, బౌలింగ్ రెండిట్లోనూ ఫెయిల్..

భారీ ధర పెట్టి కొనుగోలు చేసినా, గ్రీన్ బ్యాటింగ్‌లో పరుగులు రాబట్టకపోయాడు. బౌలింగ్‌లో అవకాశాలను ఉపయోగించకపోవడం కారణంగా జట్టుకు 'భారంగా' మారుతున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. తన తర్వాతి మ్యాచ్‌ల్లో అయినా మంచి ప్రదర్శన ఇస్తూ తన స్థాయి ఏంటో నిరూపిస్తాడని అందరూ ఎదురు చూస్తున్నారు. మరోవైపు, ఈరోజు ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. కేవలం 3.4 ఓవర్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ 25 పరుగులు చేసి, రెండు కీలక వికెట్లు కోల్పోయింది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పోస్ట్: 

Advertisement