IPL 2026: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. హైదరాబాద్ మ్యాచ్ టికెట్లు ఇవాళ విడుదల!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఘనంగా ప్రారంభం కానుంది. ప్రారంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు పరస్పరం తలపడనున్నాయి. హైదరాబాద్‌లో జరగనున్న మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల విడుదలపై తాజా సమాచారం వెలువడింది. ఏప్రిల్ 5న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం)లో జరిగే సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ టికెట్లు మార్చి 26 గురువారం సాయంత్రం 5 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది.
వివరాలు
హైదరాబాద్ జెర్సీ ఉచితంగా పొందండిలా..
ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలని భావించే అభిమానులు "డిస్ట్రిక్" యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ప్రతి రెండు టికెట్ల కొనుగోలుకు ఒక సన్‌రైజర్స్ హైదరాబాద్ జెర్సీని ఉచితంగా అందిస్తామని జట్టు ప్రకటించింది. అదనంగా, ఆఫ్‌లైన్‌లో కూడా టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అయితే ఆఫ్‌లైన్ టికెట్ల విక్రయ కేంద్రాల వివరాలపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. జట్టు విషయానికి వస్తే, ఇషాన్ కిషన్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెన్ను నొప్పి కారణంగా ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. ప్రస్తుతం ఆయన గాయం నుంచి కోలుకుంటున్నాడు. కమిన్స్ పూర్తిగా ఫిట్ అయ్యే వరకు ఇషాన్ కిషన్ జట్టును నడిపించనున్నాడు. అలాగే అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.