LOADING...
IPL 2026: ఐపీఎల్‌ మెగా ట్రేడ్‌ .. రాజస్థాన్ జట్టులోకి జడేజా.. <span style="font-size: 26px;" data-mce-style="font-size: 26px;">చెన్నై</span> జట్టులోకి సంజు శాంసన్ 
ఐపీఎల్‌ మెగా ట్రేడ్‌ .. రాజస్థాన్ జట్టులోకి జడేజా.. చెన్నై జట్టులోకి సంజు శాంసన్

IPL 2026: ఐపీఎల్‌ మెగా ట్రేడ్‌ .. రాజస్థాన్ జట్టులోకి జడేజా.. చెన్నై జట్టులోకి సంజు శాంసన్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2025
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ 2026 సీజన్‌కు ముందుగా ఫ్రాంఛైజీల మధ్య జరుగుతున్న ఆటగాళ్ల మార్పులు అభిమానుల్లో భారీ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తాజాగా మొత్తం ఎనిమిది మంది క్రికెటర్లు ట్రేడ్‌ అయినట్లు ఐపీఎల్‌ అధికారం అధికారికంగా ప్రకటించింది. ముందుగా మీడియాలో వచ్చిన వార్తలను నిజం చేస్తూ, స్టార్‌ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్‌ కరణ్‌ ఇద్దరూ రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టులో చేరారు. మరోవైపు రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌లోకి మారాడు. అంతేకాక భారత సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నుంచి లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌కు మారాడు.

Details

లక్నో జట్టులోకి అర్జున్ టెండూల్కర్

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌ కుమారుడు అర్జున్‌ తెందూల్కర్‌ కూడా ముంబయి ఇండియన్స్‌ నుంచి లఖ్‌నవూ టీమ్‌లోకి చేరాడు. ఈ మార్పుల్లో భాగంగా లెగ్‌స్పిన్నర్‌ మయాంక్‌ మార్కండే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నుంచి ముంబయి ఇండియన్స్‌కు వచ్చాడు . నితీశ్‌ రాణా రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ట్రేడ్‌ కాగా, డోనోవన్‌ ఫెరీరా ఢిల్లీ క్యాపిటల్స్‌ నుంచి రాజస్థాన్‌ రాయల్స్‌ గూటికి చేరాడు.