Vaibhav Suryavanshi: సిక్సర్ల తుఫాన్.. క్రిస్ గేల్ చారిత్రక రికార్డును చెరిపేసిన వైభవ్ సూర్యవంశీ!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఎన్నో సంవత్సరాలుగా చెదరని రికార్డును ఓ కుర్ర ఆటగాడు బద్దలు కొట్టాడు. రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన దూకుడు ఆటతో వెస్టిండీస్ విధ్వంసక బ్యాటర్ క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును అధిగమించి కొత్త చరిత్ర సృష్టించాడు. ఇంకా పదహారేళ్లు కూడా నిండని ఈ యువ ఆటగాడు మైదానంలో సిక్సర్ల వర్షం కురిపిస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్లలో క్రిస్ గేల్ ఒకడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 2012 సీజన్‌లో గేల్ మొత్తం 59 సిక్సర్లు బాది అరుదైన ఘనత సాధించాడు.
వివరాలు
భయం ఎరుగని బ్యాటింగ్.. బౌలర్లకు చుక్కలు!
ఆ రికార్డు దాదాపు పద్నాలుగేళ్ల పాటు ఎవరూ చేరుకోలేకపోయారు. అయితే ఈసారి రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న వైభవ్ సూర్యవంశీ ఆ అసాధ్యాన్ని సాధించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన కీలక పోరులో వైభవ్ తన దూకుడు బ్యాటింగ్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లను ఏమాత్రం లెక్కచేయకుండా మైదానం నలుమూలలా భారీ షాట్లు ఆడాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో సాకిబ్ హుస్సేన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో అద్భుతమైన ఇన్-సైడ్ అవుట్ షాట్‌తో కవర్స్ మీదుగా భారీ సిక్సర్ సాధించాడు. ఈసిక్సర్‌తోనే అతడు ఈ సీజన్‌లో 60సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. వైభవ్ ఈ సీజన్‌లో కేవలం సిక్సర్ల రికార్డుతోనే కాకుండా మరో అరుదైనఘనతను కూడా తన పేరిట నమోదు చేసుకున్నాడు.
వివరాలు
చిన్న వయసులోనే దిగ్గజాల రికార్డులు బద్దలు!
అత్యంత చిన్న వయసులో 600 పరుగులు సాధించిన ఆటగాడిగా రిషభ్ పంత్ రికార్డును అధిగమించాడు. ఒత్తిడితో కూడిన పెద్ద లీగ్‌లో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు కూడా తడబడుతున్న సమయంలో, ఈ యువ ఆటగాడు చూపిస్తున్న ధైర్యం అందరినీ ఆకట్టుకుంటోంది. బంతిని బలంగా కొట్టే తీరు, షాట్ల ఎంపిక, ఆత్మవిశ్వాసం చూస్తుంటే భవిష్యత్తులో భారత క్రికెట్‌కు గొప్ప విధ్వంసక బ్యాటర్ దొరికాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీహార్‌కు చెందిన ఈ యువ ఆటగాడు మైదానంలో సిక్సర్లు బాదుతున్న ప్రతీసారి స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో మారుమోగుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఐపీఎల్ చరిత్రలో కొత్త అధ్యాయం
A 15-year-old just broke Chris Gayle's record 🤯
— IndianPremierLeague (@IPL) May 27, 2026
Vaibhav Sooryavanshi is truly special 🩷
Updates ▶️ https://t.co/OBIYYIuhbt #TATAIPL | #Eliminator | #TheFinalLeap | #SRHvRR pic.twitter.com/3EXl40fEJj