IPL: విరాట్ కోహ్లీని ఎక్కువసార్లు డక్ ఔట్ చేసిన టీమ్స్ ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ(Virat Kohli) దాదాపు అన్ని జట్లపై అద్భుతమైన రికార్డులు నమోదు చేశాడు. 2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న కోహ్లీ, అనేక మ్యాచ్‌ల్లో జట్టుకు కీలక విజయాలు అందించాడు. అయితే ఇప్పటివరకు రెండు జట్లపై మాత్రం అతడు అత్యధికసార్లు డక్ అవుట్ అయ్యాడు. తాజాగా ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్'తో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన కోహ్లీ, ఆ జట్టుపై మూడోసారి ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు.
వివరాలు
సన్ రైజర్స్ హైదరాబాద్ vs కోహ్లీ
అయినప్పటికీ ముంబైపై అతడు 950కుపైగా పరుగులు చేసి 7 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ పై కూడా కోహ్లీ మూడు సార్లు డక్ అవుట్ అయ్యాడు. ఆ జట్టుపై అతడు ఒక సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలతో 850కుపైగా పరుగులు సాధించాడు. అలాగే లక్నో సూపర్ జెయింట్స్ పై రెండు సార్లు, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై ఒక్కోసారి డక్‌గా వెనుదిరిగాడు.