LOADING...
IPL: క్రికెట్ లీగ్స్‌లో కొత్త కింగ్.. మూడో స్థానంలో ఐపీఎల్
క్రికెట్ లీగ్స్‌లో కొత్త కింగ్.. మూడో స్థానంలో ఐపీఎల్

IPL: క్రికెట్ లీగ్స్‌లో కొత్త కింగ్.. మూడో స్థానంలో ఐపీఎల్

వ్రాసిన వారు Moogati Shabari
Mar 20, 2026
11:35 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌గా గుర్తింపు పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజాగా విడుదలైన ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో నిలిచింది. వరల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్ విడుదల చేసిన టాప్ 10 ఫ్రాంచైజీ లీగ్‌ల జాబితాలో ఇంగ్లాండ్‌కు చెందిన ది హండ్రెడ్ మొదటి స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఎస్ఏ20 రెండో స్థానంలో నిలిచింది. WCA వివరాల ప్రకారం.. ఐపీఎల్ ఆటగాళ్లకు ఇచ్చే సగటు పారితోషికం, చెల్లింపుల విషయంలో అత్యధిక మార్కులు సాధించింది. అయితే "రైట్ టు ఆర్గనైజ్", "డిస్ప్యూట్ రిజల్యూషన్" వంటి అంశాల్లో వెనుకబడటంతో టాప్ స్థానాన్ని దక్కించుకోలేకపోయింది.

వివరాలు

ఏయే లీగ్‌లు ఎన్నో స్థానంలో ఉన్నాయంటే..

ఈ జాబితాలో ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ నాలుగో స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ కు చెందిన పాకిస్థాన్ సూపర్ లీగ్ ఐదో స్థానంలో ఉంది. మిగతా లీగ్‌ల ర్యాంకులు ఇలా ఉన్నాయి: మేజర్ లీగ్ క్రికెట్ ఇంటర్నేషనల్ లీగ్ టీ20 ఏడో స్థానం, కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఎనిమిదో స్థానం, అబుదాబి టీ10 తొమ్మిదో స్థానం, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ పదో స్థానంలో నిలిచాయి. ఈ సందర్భంగా WCA సీఈఓ టామ్ మోఫాట్ మాట్లాడుతూ.. దేశీయ లీగ్‌లు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, అయితే ఆటగాళ్ల హక్కులు, సంక్షేమం కాపాడటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. అన్ని లీగ్‌లు విజయవంతం కావాలని, ఆటగాళ్లకు సరైన రక్షణ, ప్రమాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Advertisement