ఐర్లాండ్ ఆటగాడిని రూ.4.4 కోట్లకు దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్
ప్రపంచలోనే మోస్ట్ పాపులర్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ ఆడటాన్ని చాలా గొప్ప గౌరవంగా భావిస్తారు ప్రపంచదేశాల క్రికెటర్లు.. ఐపీఎల్ 2023 మినీ వేలంలో అసోసియేట్ ప్లేయర్లకు అవకాశం దక్కింది.. ఇండియా, ఐర్లాండ్ మధ్య జరిగిన సీరిస్ లో అద్భుతంగా అదరగొట్టిన జోషువా లిటిల్‌ని రూ.4.4 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయిన మొట్టమొదటి ఐర్లాండ్ క్రికెటర్ గా జోషువా లిటిల్ రికార్డు క్రియేట్ చేశాడు. 23 ఏళ్ల లిటిల్ 2016లో ఐర్లాండ్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. డబ్లిన్‌కు చెందిన లెఫ్టార్మ్ సీమర్ తన దేశం తరఫున రెండు వన్డేలు, 53 టీ20 లు ఆడాడు.
గతంలో హ్యట్రిక్ నమోదు
న్యూజిలాండ్‌తో జరిగిన ICC T20 ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్ నమోదు చేసిన ఆరవ బౌలర్‌గా నిలిచాడు. లిటిల్ గత సంవత్సరం చెన్నై సూపర్ కింగ్స్‌కు నెట్ బౌలర్‌గా ఉన్నాడు డైరెక్టర్ రిచర్డ్ హోల్డ్‌స్‌వర్త్ దీనిపై స్పందిస్తూ.. మేము లిటిల్ ఎంపికపై సంతోషిస్తున్నాం. లిటిల్ కష్టపడి పనిచేస్తాడు. ఐపీఎల్ పాల్గొనడం ద్వారా మంచి భవిష్యతు ఉంటుందని పేర్కొన్నారు. గుజరాత్ టైటాన్స్ విజయంలో కీలక పాత్ర పోషిస్తాడు. తన అద్భుతమైన బౌలింగ్‌తో వికెట్లు పడగొట్టే సత్తా కూడా ఉందన్నారు.