LOADING...
Virat Kohli: ఈ ఐపీఎల్‌లో కోహ్లీ అదరగొడతాడు: ఇర్ఫాన్ పఠాన్
ఈ ఐపీఎల్‌లో కోహ్లీ అదరగొడతాడు: ఇర్ఫాన్ పఠాన్

Virat Kohli: ఈ ఐపీఎల్‌లో కోహ్లీ అదరగొడతాడు: ఇర్ఫాన్ పఠాన్

వ్రాసిన వారు Moogati Shabari
Mar 13, 2026
01:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో కోహ్లీ మరింత దూకుడుగా ఆడతాడని పఠాన్ అభిప్రాయపడ్డాడు. వరుసగా రెండోసారి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో కోహ్లీ గ్రౌండ్ లోకి దిగుతాడని అన్నాడు. గత సీజన్‌లో రాయల్ చాలెంజెర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన తుది పోరులో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఆ జట్టు విజేతగా నిలిచింది.

వివరాలు

కప్ సాధించడమే కోహ్లీ లక్ష్యం

ఈ నేపథ్యంలో కోహ్లీ ఆట గురించి పఠాన్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీలో పరుగులపై ఉన్న ఆకలి ఇప్పటికీ అలాగే ఉందన్నారు. నిజానికి అది గతంతో పోలిస్తే మరింత పెరిగిందన్నారు. ముఖ్యంగా గత సీజన్‌లో జట్టు విజేతగా నిలిచిన తర్వాత కోహ్లీ ఉత్సాహం మరింత పెరిగిందని, వరుసగా రెండోసారి ట్రోఫీ గెలవాలని కోహ్లీ భావిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ ప్రదర్శనల గురించి కూడా పఠాన్ ప్రస్తావించాడు. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లతో జరిగిన మ్యాచుల్లో కోహ్లీ అద్భుతంగా రాణించాడన్నారు. అదే ఆత్మవిశ్వాసంతో ఈ ఐపీఎల్ సీజన్‌లోనూ బరిలోకి దిగి దూకుడుగా ఆడే ప్రయత్నం చేస్తాడన్నారు. మరోసారి తన జట్టుకు టైటిల్ అందించాలనే లక్ష్యంతో కోహ్లీ ఆడతాడని పఠాన్ అభిప్రాయపడ్డాడు.

Advertisement