
Irfan Pathan: కేఎల్ రాహుల్ పై ప్రశంసల వర్షం కురిపించిన ఇర్ఫాన్ పఠాన్
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్(KL Rahul) పోరాటానికి ప్రశంసలు దక్కుతున్నాయి.
కేఎల్ రాహుల్ అత్భుతమైన ప్రతిభావంతుడు అని సీనియర్ ఆటగాళ్లు కొనియాడారు.
తాజాగా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) కూడా కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌కు ఫిదా అయిపోయాడు.
కళాత్మకమైన షాట్లతో రాహుల్ అద్భుతంగా రాణించాడని పేర్కొన్నాడు.
లాఫ్టెడ్ డ్రైవ్‌లు, దూకుడైన పుల్‌షాట్లు, గోడకట్టినట్లున్న డిఫెన్స్, అద్భుతమైన స్థిరత్వం... ఇలా రాహుల్ ఇన్నింగ్స్‌లో అన్నీ ఉన్నాయంటూ ఎక్స్ వేదికగా ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశారు.
Details
కేఎల్ రాహుల్ ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగలడు : సంజయ్ బంగర్
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆసాధారణ ఆటతీరుతో కేఎల్ రాహుల్ విలువైన పరుగులు చేశారని ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించారు.
మరోవైపు ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ కు ఉన్న అనుభవం అమూల్యమైందని టీమిండియా మాజీ బ్యాటర్ సంజయ్ బంగర్ అభివర్ణించాడు.
కొత్త బంతిని ఎదుర్కోవడంలో రాహుల్ కి అద్భుతమైన అనుభవం ఉందని, దాదాపు 25 ఇన్నింగ్స్ లో అతడు ఓపెనర్ గా బరిలోకి దిగాడన్నారు.
1-6 స్థానాల్లో ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడని, అదే అతడిని వెల్ రౌండెడ్ ఆటగాడిగా మార్చిందన్నారు.
నాణ్యమైన ఇన్నింగ్స్ లు ఆడేందుకు కేఎల్ రాహుల్ ఎల్లప్పుడు ముందుంటాడని సంజయ్ బంగర్ చెప్పుకొచ్చాడు.