LOADING...
Hardik Pandya : బ్రిటిష్ సింగర్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్.. ఇన్‌స్టాలో పోస్టులు వైరల్
బ్రిటిష్ సింగర్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్.. ఇన్‌స్టాలో పోస్టులు వైరల్

Hardik Pandya : బ్రిటిష్ సింగర్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్.. ఇన్‌స్టాలో పోస్టులు వైరల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 14, 2024
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్ క్రికెటర్ హర్థిక్ పాండ్యా ఈ మధ్యే సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్‌తో వివాహ బంధానికి ముగింపు పలికారు. అప్పటి నుంచి వీరికి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూనే ఉంది. తాజాగా హార్ధిక్ పాండ్యా మరో అమ్మాయిలో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. బ్రిటిష్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియా‌తో హార్ధిక్ పాండ్యా డేటింగ్‌లో ఉన్నారని, ఈ మధ్యనే వీరిద్దరూ కలిసి వివాహార యాత్రకు వెళ్లినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

Details

రియాల్టీ షో ద్వారా అభిమానులకు చేరువైన జాస్మిన్ వాలియా

హార్ధిక్ పాండ్యా కొన్ని గంటల క్రితం తన ఇన్ స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్టు చేశాడు. గ్రీస్‌లోని ఓ హోటల్ స్విమ్మింగ్ ఫూల్ వద్ద అతను నడుస్తూ కనిపించాడు. దీనికి నాలుగు క్రితం జాస్మిన్ వాలియా కూడా అదే లొకేషన్ ఉన్న ఫోటోలు దిగి ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ పోస్టులకు ఒకరికొకరు లైక్‌లు చేసుకోవడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది. ఇంగ్లండ్ లోని ఎసెక్స్ ప్రాంతానికి చెందిన జాస్మిన్ రియాల్టీ షో ద్వారా అభిమానులకు చేరువైంది. ప్రస్తుతం ఆమెకు ఇన్ స్టాలో 6.4 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.