శ్రీలంకతో టీ20 సిరీస్.. కెప్టెన్ గా హర్థిక్ పాండ్యా..?
ఈ వార్తాకథనం ఏంటి
టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టైం ఈ మధ్య అస్సలేమీ బాగోలేదు. ఆసియా కప్ T20 టోర్నమెంట్ మొదలుకొని T20 ప్రపంచ కప్ తో అశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించి, హర్థిక్ పాండ్యాకు జట్టు పగ్గాలను అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది.
జనవరిలో టీమిండియా శ్రీలంకతో 3 మ్యాచ్‌ల T20I సిరీస్‌ను ఆడనుంది. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని సోషల్ మీడియాలో ఓ ప్రోమో వైరల్ అవుతోంది.
బంగ్లాదేశ్ సిరీస్‌లో రోహిత్ శర్మ గాయపడిన విషయం తెలిసిందే. అతని గాయం నుండి కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
హర్థిక్ పాండ్యా
రాహుల్‌పై వేటు పడే అవకాశం..?
వచ్చే నెలలో బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టితో కేఎల్ రాహుల్ ఏడడుగులు వేయనున్నాడు. అందుకే తనను ఈ సిరీస్‌కు పరిగణనలోకి తీసుకోవద్దని సెలక్టర్లకు రాహుల్ ఇప్పటికే చెప్పేశాడట. అయితే రాహుల్ అందుబాటులో ఉన్నా టీ20 ప్రపంచకప్, ఆ తర్వాతి పేలవ ప్రదర్శన నేపథ్యంలో అతడిపై వేటు పడడం ఖాయమనే తెలుస్తోంది.
టీమ్ఇండియా మ్యాచ్‌లను ప్రసారం చేసే స్టార్ స్పోర్ట్స్ టీ20 సిరీస్ ప్రోమో కూడా అందుకు బలాన్నిచేకూరుస్తోందని అభిమానులు భావిస్తున్నారు.
శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను ప్రమోట్ చేస్తూ స్టార్ స్పోర్ట్స్ ఓ వీడియోని రూపొందించి 'నూతన సంవత్సరంలో శ్రీలంకతో సిరీస్‌ని ఆడేందుకు హార్దిక్ పాండ్య సిద్ధమవుతున్నాడు. కొత్త టీమ్‌ఇండియా యాక్షన్‌ని చూసేందుకు సిద్ధమవ్వండి'అని స్టార్ స్పోర్స్ ట్వీట్ చేయడం గమనార్హం.