LOADING...
LSG Vs RCB: వాళ్లను వదిలేస్తేనే జట్టుకు మేలు?.. ఆ ఇద్దరి వల్ల రూ.48 కోట్లు నష్టం!
వాళ్లను వదిలేస్తేనే జట్టుకు మేలు?.. ఆ ఇద్దరి వల్ల రూ.48 కోట్లు నష్టం!

LSG Vs RCB: వాళ్లను వదిలేస్తేనే జట్టుకు మేలు?.. ఆ ఇద్దరి వల్ల రూ.48 కోట్లు నష్టం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 16, 2026
03:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. బుధవారం రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూర్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఐదు వికెట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు కేవలం 146 పరుగులకే ఆలౌట్ అవ్వగా, విరాట్ కోహ్లీ 49 పరుగులతో రాణించి ఆర్సీబీకి సులభ విజయాన్ని అందించాడు. బెంగళూరు జట్టు కేవలం 15.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. జట్టు వరుస పరాజయాలతో ఫ్రాంచైజీ యజమాని సంజయ్ గోయాంక తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. లక్నో వైఫల్యానికి ప్రధాన కారణంగా భారీ ధరలకు కొనుగోలు చేసిన స్టార్ ఆటగాళ్లు రిషబ్ పంత్, నికోలస్ పూరన్ పేలవ ప్రదర్శనలనే క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

వివరాలు

అత్యధిక ధరకు రిషబ్ పంత్ రూ. 27కోట్లు

ఈ ఇద్దరిపై ఫ్రాంచైజీ మొత్తం రూ. 48 కోట్లు వెచ్చించడం గమనార్హం. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు(రూ. 27 కోట్లు)ఎంపికైన రిషభ్ పంత్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా జట్టును నడిపించడంలో విఫలమవుతున్నాడు. సన్‌రైజర్స్‌పై చేసిన 68 పరుగులు మినహా మిగిలిన మ్యాచ్‌ల్లో అతను రెండంకెల స్కోరు చేయడానికే ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా ఆర్సీబీతో జరిగిన కీలక మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగుకే అవుట్ కావడం అతని ఫామ్‌పై సందేహాలు రేకెత్తిస్తోంది. మరోవైపు రూ. 21 కోట్లకు రిటైన్ చేసిన నికోలస్ పూరన్ పరిస్థితి మరింత నిరాశాజనకంగా ఉంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా 20 పరుగుల మార్కును దాటలేకపోయాడు. మొత్తం ఐదు మ్యాచ్‌ల్లో అతను చేసిన పరుగులు కేవలం 42 మాత్రమే.

వివరాలు

విఫలమవుతున్న పూరన్

గత సీజన్లలో చూపిన ప్రదర్శన ఆధారంగా భారీగా పెట్టుబడి పెట్టిన యాజమాన్యానికి పూరన్ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదు. ప్రత్యేకించి కీలక సమయాల్లో వికెట్లు కోల్పోతూ జట్టును కష్టాల్లోకి నెట్టడం యజమాని గోయెంకాకు ఆగ్రహం కలిగిస్తోంది. ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో లక్నో పాయింట్ల పట్టికలో వెనుకబడిపోతోంది. భారీగా ఖర్చు చేసినప్పటికీ ఫలితాలు రాకపోవడంతో, వచ్చే సీజన్ వేలంలో పంత్, పూరన్‌లను వదిలేసే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి. రాబోయే మ్యాచ్‌ల్లో అయినా ఈ ఇద్దరు ఫామ్‌లోకి వచ్చి జట్టును గెలుపు బాట పట్టించకపోతే, మేనేజ్‌మెంట్ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

Advertisement