Australia : ఆస్ట్రేలియా ప్రపంచ కప్ గెలవడానికి ఆ ఒక్క మీటింగ్ కారణమా..?
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో తొలుత ఓటములతో ఇబ్బంది పడ్డ ఆస్ట్రేలియా జట్టు ఆ తర్వాత వరుస విజయాలతో విశ్వవిజేతగా నిలిచింది. దీని వెనుక ఉన్న రహాస్యాన్ని ఆ జట్టు కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ (Andrew McDonald) తాజాగా వివరించాడు. దక్షిణాఫ్రికాతో ఓటమి తర్వాత తమ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కోసం ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆ సమావేశంలో నిర్ణయాలే జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాయని గుర్తించామని, జట్టులోని లోపాలపై నిజాయతీగా చర్చించుకున్నాడని మెక్ డొనాల్డ్ వెల్లడించారు. మొదట్లో ఫలించని వ్యూహం ఆ తర్వాత మెల్లగా ప్రయోజనాలను ఇచ్చిందన్నారు.
ఆస్ట్రేలియా తన వ్యూహానికే కట్టుబడి విజేతగా అవతరించింది
ఇక వన్డే వరల్డ్ కప్ నాకౌట్లతో సహా 11 మ్యాచులాడిన ఆస్ట్రేలియా తొలి రెండు మ్యాచుల్లో మాత్రమే ఓటమిని చవిచూసింది. ముఖ్యంగా అఫ్గానిస్థాన్ తో మ్యాచులో ఓటమి అంచు వరకు వెళ్లిన ఆస్ట్రేలియా.. మాక్స్ వెల్ డబుల్ సెంచరీతో విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుసగా తొమ్మిది విజయాలు నమోదు చేసి వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. సాధారణంగా ప్రపంచ కప్ టోర్నీలో రెండు ఓటములతో ప్రారంభించిన ఏ జట్టు అయినా తన వ్యూహాన్ని పున:సమీక్షించుకొని మార్పులు చేయాలనుకుంటుంది. అయితే ఆస్ట్రేలియా మాత్రం తన వ్యూహానికే కట్టుబడి విజేతగా నిలవడం విశేషం.