Tilak Varma : ఆ బ్యూటీఫుల్ నేపాలీ క్రికెటర్‌తో తిలక్ వర్మ ప్రేమాయణమా? సోషల్ మీడియాలో హల్‌చల్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత జట్టు యువ బ్యాట్స్‌మన్ తిలక్ వర్మ ప్రస్తుతం మైదానంలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చకు కేంద్రబిందువుగా మారాడు. "తిలక్ వర్మ నేపాల్‌కు చెందిన అందమైన క్రికెటర్ ఇందు బర్మతో డేటింగ్ చేస్తున్నాడా? వీరిద్దరి మధ్య ప్రేమ సంబంధం కొనసాగుతోందా? అనే ప్రశ్నలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ ఇద్దరు క్రికెటర్ల పేర్లతో అనేక పోస్టులు, ఫోటోలు వైరల్ అవుతుండగా.. వారిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. అయితే, ఈ వార్తలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదన్న విషయం స్పష్టంగా గమనించాల్సి ఉంది.
Details
నేపాల్ తరఫున 78 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఇందు బర్మ
ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది? ఈ వార్తల వెనుక నిజానిజాలు ఏమిటన్నది పరిశీలిద్దాం. 28 ఏళ్ల ఇందు బర్మ నేపాల్ మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా వ్యవహరిస్తున్న ఆమె కుడిచేతితో బ్యాటింగ్, బౌలింగ్ చేస్తుంది. నేపాల్ తరఫున ఇప్పటివరకు 78 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఇందు బర్మ, బ్యాట్‌తో 1041 పరుగులు సాధించడమే కాకుండా 40 వికెట్లు కూడా పడగొట్టింది. ఆటలో ప్రతిభతో పాటు అందంతోనూ మహిళా క్రికెట్‌లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ప్రపంచంలోని టాప్-10 మహిళా క్రికెటర్లలో ఒకరిగా ఇందు బర్మను పరిగణిస్తారు. ఇక తిలక్ వర్మ విషయానికి వస్తే.. అతను ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీమిండియా టీ20 సిరీస్‌లో సభ్యుడిగా ఉన్నాడు.
Details
ఆసియా కప్ ఫైనల్‌లో తిలక్ వర్మ కీలక పాత్ర
ఈ ఏడాది భారత్ పాకిస్తాన్‌పై విజయం సాధించిన ఆసియా కప్ ఫైనల్‌లో కూడా తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు. లెఫ్ట్‌హ్యాండ్ బ్యాట్స్‌మన్ అయిన తిలక్ వర్మ ఇప్పటివరకు భారత జట్టు తరఫున 5 వన్డేలు, 38 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. తిలక్ వర్మ ప్రపంచంలోని అనేక దేశాల్లో భారత్ తరఫున క్రికెట్ ఆడినప్పటికీ, ఇప్పటివరకు నేపాల్‌లో మాత్రం క్రికెట్ ఆడలేదు. అలాంటి పరిస్థితిలో ఇందు బర్మతో అతనికి పరిచయం ఎప్పుడు ఏర్పడింది? వారిద్దరూ ప్రత్యక్షంగా కలుసుకోకుండానే రిలేషన్‌షిప్ ఎలా మొదలైంది? అనే ప్రశ్నలు ఈ వార్తలపై మరింత అనుమానాన్ని కలిగిస్తున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు కూడా ఏఐ సాయంతో రూపొందించినట్లుగా కనిపిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.