LOADING...
Ishan Kishan: ఊచకోత బ్యాటింగ్‌తో చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్
ఊచకోత బ్యాటింగ్‌తో చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్

Ishan Kishan: ఊచకోత బ్యాటింగ్‌తో చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 13, 2026
10:02 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 12న నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా వికెట్‌కీపర్‌-బ్యాటర్‌ ఇషాన్ కిషన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్‌సెంచరీ బాదిన ఇషాన్‌, టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో అర్ధశతకం సాధించిన తొలి భారత వికెట్‌కీపర్‌-బ్యాటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. అతనికంటే ముందు ఏ భారత వికెట్‌కీపర్‌ కూడా ఈ ఘనతను అందుకోలేదు. భారత్‌ 2007, 2024ల్లో రెండు సార్లు టీ20 ప్రపంచకప్‌ టైటిళ్లు గెలిచినా, వికెట్‌కీపర్‌ నుంచి హాఫ్‌సెంచరీ రాకపోవడం విశేషం. ఈ అరుదైన రికార్డు ఇషాన్‌ కేవలం 20 బంతుల్లోనే నమోదు చేశాడు.

Details

20 బంతుల్లోనే అర్ధశతకం

టాస్‌ ఓడి, నమీబియా ఆహ్వానం మేరకు ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్‌గా ఇషాన్‌ రంగంలోకి దిగాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో కాస్త నిదానంగా ఆడిన అతడు, మూడో ఓవర్లో తన సహజ శైలిలోకి మారాడు. ఆ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదిన ఇషాన్‌, తదుపరి ఓవర్లో మరో బౌండరీ సాధించాడు. ఆరో ఓవర్లో అయితే వరుసగా నాలుగు సిక్సర్లు, ఒక బౌండరీ బాదాడు. తర్వాతి ఓవర్లో మరో సిక్సర్‌, బౌండరీ కొట్టి తన దూకుడును కొనసాగించాడు. అయితే ఏడో ఓవర్‌ తొలి బంతికి భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ 24 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 పరుగులు సాధించాడు.

Advertisement