Page Loader
పింక్‌బాల్ టెస్టుకు భారత్ దూరం
పింక్ బాల్ టెస్టు మ్యాచ్

పింక్‌బాల్ టెస్టుకు భారత్ దూరం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 24, 2022
12:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

2015లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి పింక్‌బాల్ టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పింక్‌బాల్ టెస్ట్‌గా పిలిచే డే-నైట్ టెస్ట్, ఇతర టెస్టుల కంటే భిన్నంగా ఉంటుంది. డే-నైట్ టెస్ట్‌‌లో రెడ్‌బాల్‌కు బదులుగా పింక్‌బాల్ఉపయోగిస్తారు. అందుకే దీనిని పింక్ బాల్ టెస్ట్ అంటారు. పింక్‌బాల్ లైట్లలో ఎక్కువగా కనిపిస్తుందని, ఈ మేరకు బాల్‌ను ఐసీసీ మార్చింది. ఫిబ్రవరి-మార్చిలో భారత్‌,అస్ట్రేలియాతో అహ్మదాబాద్ లో డే\నైట్ పింక్ బాల్ టెస్ట్ జరుగుతుందని అందరూ భావించారు. కానీ అది ఏదో కారణం వల్ల ఆగిపోయింది. ఇది పూర్తిగా బీసీసీఐ వైఫల్యంగా కనిపిస్తోంది.

పింక్ బాల్ టెస్టు మ్యాచ్

వాటదారులు నష్టపోయే ప్రమాదం

BCCI అంగీకరించకపోవడానికి కారణం ఆటల సమయం మందగించడం. పింక్ బాల్ టెస్టులు వాస్తవానికి ఐదు రోజులు కొనసాగాలి. బంగ్లాదేశ్, ఇంగ్లాడ్, శ్రీలంకతో భారత్ ఆడిన టెస్టులు కేవలం రెండు, మూడు రోజులు మాత్రమే కొనసాగాయి. ఐదు రోజులు కొనసాగుతుందని టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులు దీనివల్ల నష్టపోయారు కూడా. ఐదురోజుల పాటు జరగాల్సిన గేమ్‌ల అకాల ముగింపుతో కూడా అసంతృప్తిగా ఉన్నట్లు అర్థమవుతోంది. ఆట 5రోజులు కొనసాగకపోవడం వల్ల వాటాదారులు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇకపై డే-నైట్ టెస్టులను నిర్వహించడానికి అనుకూలంగా లేదు. ఇప్పటి వరకు పింక్-బాల్ టెస్ట్‌లలో అజేయంగా ఉన్న ఆస్ట్రేలియా డే-నైట్ టెస్ట్ ఆడేందుకు ఆసక్తిని కనబరిచిస్తున్న బీసీసీఐ ముందుకెళ్లకపోవడం గమనార్హం.