LOADING...
Jacob Duffy: సన్‌రైజర్స్ బ్యాటర్ల వెన్నులో భయం పుట్టించిన 'జేకబ్ డఫీ'.. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరంటే?
సన్‌రైజర్స్ బ్యాటర్ల వెన్నులో భయం పుట్టించిన 'జేకబ్ డఫీ'.. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరంటే?

Jacob Duffy: సన్‌రైజర్స్ బ్యాటర్ల వెన్నులో భయం పుట్టించిన 'జేకబ్ డఫీ'.. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 28, 2026
11:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో జేకబ్ డఫీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలను పెవిలియన్‌కు పంపి, ఆరంభంలోనే ఆ జట్టును కష్టాల్లోకి నెట్టాడు. డఫీ అద్భుతమైన స్వింగ్‌తో బ్యాటర్లను తికమకపెట్టిన తర్వాత, ఇన్-ఫామ్ బ్యాటర్ నితీష్ కుమార్ రెడ్డిని కూడా అవుట్ చేసి సత్తా చాటాడు. పరుగుల వరదగా పేరుగాంచిన చిన్నస్వామి స్టేడియం పిచ్‌లో 29 పరుగులకే 3 వికెట్లు తీసి హైదరాబాద్ జట్టుకు కోలుకొలేని దెబ్బ కొట్టాడు. ఈ మూడు వికెట్లు జేకబ్ డఫీ ఖాతాలో చేరడం విశేషం.

వివరాలు

డఫీ ప్రయాణం ఇదే

జేకబ్ డఫీ న్యూజిలాండ్‌కు చెందిన కుడిచేతి వేగవంతమైన బౌలర్. కచ్చితమైన లెంగ్త్‌తో బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడంలో ప్రత్యేకతను చూపిస్తాడు. కివీస్ దేశవాళీ క్రికెట్‌లో ఒటాగో జట్టు తరపున అనేక అద్భుత ప్రదర్శనలు చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో న్యూజిలాండ్ కోసం టీ20 మ్యాచ్‌లలో కూడా తన సత్తాను చాటాడు. ఐపీఎల్ 2026 వేలంలో బెంగళూరు యాజమాన్యం అతనిపై నమ్మకం ఉంచి జట్టులోకి తీసుకుంది. మొదటి మ్యాచ్‌లోనే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని కీలక వికెట్లు పడగొట్టడం డఫీ విశిష్టత.

వివరాలు

బౌలింగ్‌లో వైవిధ్యం

డఫీ కేవలం వేగంతోనే కాకుండా, తన తెలివితేటలతో వికెట్లు తీస్తాడు. స్లోయర్ బంతులు, కట్టర్లను ఫ్రీజ్ చేయడంలో అతనికి ప్రత్యేక దిట్టత ఉంది. ట్రావిస్ హెడ్ వంటి ప్రమాదకర బ్యాటర్‌ను అవుట్ చేయడం ద్వారా డఫీ అసలు సత్తాను చాటాడు. గత సీజన్లలో బౌలింగ్ సమస్యలతో ఇబ్బంది పడ్డ బెంగళూరు జట్టుకు, డఫీ రూపంలో ఒక శక్తివంతమైన అస్త్రం దొరికినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ మ్యాచ్‌లో అతని స్పెల్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిందని అంటున్నారు.

Advertisement

వివరాలు

భవిష్యత్తు ఆశాకిరణంగా డఫీ

తొలి మ్యాచ్‌లోనే ముగ్గురు కీలక బ్యాటర్లను అవుట్ చేయడం ద్వారా డఫీకి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. విరాట్ కోహ్లీ కూడా మైదానంలో అతనిని వెన్నుతట్టి అభినందించడం గమనార్హం. ఈ సీజన్‌లో బెంగళూరు జట్టు టైటిల్ సాధనలో డఫీ పాత్ర కీలకమవ్వనుందని, రాబోయే మ్యాచ్‌లలో ఇదే జోరు కొనసాగితే అతను ఐపీఎల్ 2026లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చోటు సంపాదించనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement