
India-Eng: రెండో టెస్టుకు జడేజా, రాహుల్ దూరం
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియాకు మరో ఎదురు దెబ్బతగిలింది. ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్‌లో ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న రెండో టెస్టుకు సీనియర్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమయ్యారు.
జడేజాకు తొడ గాయం కాగా.. రాహుల్ కుడి చేతి నొప్పి కారణంగా రెండో టెస్టుకు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది.
మరోవైపు సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను భారత జట్టులోకి వచ్చినట్లు వెల్లడించింది.
భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), గిల్, జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, కెఎస్ భరత్(వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్, సిరాజ్, ముఖేష్ కుమార్, బుమ్రా (వైస్ కెప్టెన్), అవేష్ ఖాన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ మరియు సౌరభ్ కుమార్.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీసీసీఐ ప్రకటన
The Men's Selection Committee have added Sarfaraz Khan, Sourabh Kumar and Washington Sundar to India's squad.#INDvENG https://t.co/xgxI8NsxpV
— BCCI (@BCCI) January 29, 2024