LOADING...
Ravindra Jadeja: జడేజా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ మిస్సింగ్‌.. సీఎస్కే-ఆర్‌ఆర్‌ ట్రేడ్‌పై సస్పెన్స్‌!
జడేజా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ మిస్సింగ్‌.. సీఎస్కే-ఆర్‌ఆర్‌ ట్రేడ్‌పై సస్పెన్స్‌!

Ravindra Jadeja: జడేజా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ మిస్సింగ్‌.. సీఎస్కే-ఆర్‌ఆర్‌ ట్రేడ్‌పై సస్పెన్స్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2025
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ సోమవారం అనూహ్యంగా కనిపించకపోవడంతో, ఆయన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) నుంచి వీడనున్న వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే, అతడి అకౌంట్ ఎందుకు కనిపించకపోయిందనే దానిపై మాత్రం ఎటువంటి స్పష్టత లేదు. ఇదే సమయంలో ఐపీఎల్‌ 2026 సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని చెన్నై సూపర్‌ కింగ్స్‌ పెద్ద మార్పులకు సిద్ధమవుతోందని సమాచారం. ముఖ్యంగా రాజస్థాన్‌ రాయల్స్‌ (RR) కెప్టెన్‌ సంజు శాంసన్‌ (Sanju Samson)ను తమ జట్టులోకి తీసుకునేందుకు సీఎస్కే తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం సీఎస్కే, తమ స్టార్‌ ఆల్‌రౌండర్లైన రవీంద్ర జడేజా, సామ్‌ కరన్‌లను ట్రేడ్‌లో భాగంగా వదులుకునేందుకు సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి.

Details

సీఎస్కే కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం

ఈ ప్రతిపాదనపై రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి ఆమోదం లభిస్తే, ఈ భారీ ఆటగాళ్ల మార్పిడి ఒప్పందం త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. సంజూ శాంసన్‌ 2021 నుంచి రాజస్థాన్‌ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ, జట్టుతో సుదీర్ఘ అనుబంధం కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్‌ కెరీర్‌లో అతడు ఎక్కువ మ్యాచ్‌లను రాజస్థాన్‌ తరఫునే ఆడాడు. మరోవైపు, రవీంద్ర జడేజా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో దశాబ్దానికి పైగా గాఢమైన అనుబంధం కలిగి ఉన్నాడు. 2022 సీజన్‌లో స్వల్ప కాలం సీఎస్కే కెప్టెన్‌గానూ వ్యవహరించాడు,

Details

17ఏళ్ల తర్వాత రాజస్థాన్ జెర్సీతో కనిపించే అవకాశం

అయితే జట్టు పేలవ ప్రదర్శన కారణంగా కెప్టెన్సీని తిరిగి ఎంఎస్‌ ధోని (MS Dhoni)కు అప్పగించాడు. ఆసక్తికర విషయం ఏమిటంటే, జడేజా తన తొలి రెండు ఐపీఎల్‌ సీజన్లలో రాజస్థాన్‌ రాయల్స్‌కే ప్రాతినిధ్యం వహించాడు. అదేవిధంగా సామ్‌ కరన్‌ గతంలో పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings) తరఫున ఆడాడు. ఈ ట్రేడ్‌ డీల్‌ అమలు అయితే, 17 ఏళ్ల తర్వాత జడేజా మళ్లీ రాజస్థాన్‌ జెర్సీతో కనిపించే అవకాశం ఉంది.