LOADING...
Jaspal Rana: జస్పాల్ రాణా మరణించి 16 రోజులకే తల్లి శ్యామా దేవి కన్నుమూత
జస్పాల్ రాణా మరణించి 16 రోజులకే తల్లి శ్యామా దేవి కన్నుమూత

Jaspal Rana: జస్పాల్ రాణా మరణించి 16 రోజులకే తల్లి శ్యామా దేవి కన్నుమూత

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 29, 2026
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత మాజీ షూటర్ జస్పాల్ రాణా కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. జస్పాల్ రాణా మరణించి కేవలం 16 రోజులు గడవకముందే ఆయన తల్లి శ్యామా దేవి రాణా కూడా కన్నుమూశారు. జూన్ 12న తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ జస్పాల్ రాణా తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, శ్యామా దేవి కూడా గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆదివారం దిల్లీలో ఆమె మృతి చెందారు. ఈ విషాద ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

వివరాలు 

సంతాపం తెలిపిన పుష్కర్ సింగ్ ధామి

''శ్యామా దేవి మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇటీవలే భారత మాజీ షూటర్ జస్పాల్ రాణాను కోల్పోయిన ఆ కుటుంబానికి ఇది మరో తీరని విషాదం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వరుసగా ఎదురవుతున్న ఈ దుర్ఘటనలను తట్టుకునే ధైర్యాన్ని ఆ కుటుంబానికి దేవుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను'' అని పుష్కర్ సింగ్ ధామి తన పోస్టులో పేర్కొన్నారు.

Advertisement