
ICC Rankings: టెస్టు ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా నెంబర్ వన్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా ఐసీసీ మెన్స్ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు.
ఇటీవల ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో 8 కీలక వికెట్లు తీసిన బుమ్రా, ఈ విజయంతో టీమిండియాకు 295 రన్స్ భారీ తేడాతో గెలుపు అందించారు.
ఈ ప్రదర్శనతో బుమ్రా, కగిసో రబాడ, జోష్ హేజిల్‌వుడ్‌లను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని సాదించాడు. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో యశస్వి జైస్వాల్ రెండో స్థానానికి ఎగబాకారు.
పెర్త్ మ్యాచ్‌లో 161 రన్స్ చేసి 825 పాయింట్లతో కెరీర్ బెస్ట్ సాధించారు. అయితే జో రూట్ కంటే 78 పాయింట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు.
Details
ఆల్ రౌండర్ జాబితాలో రవీంద్ర జడేజా మొదటిస్థానం
మరోవైపు 89 రన్స్ చేసిన ట్రావిస్ హెడ్ టాప్ 10లోకి చేరి 10వ స్థానంలో నిలిచారు.
విరాట్ కోహ్లీ తన 30వ టెస్ట్ సెంచరీతో 13వ స్థానానికి ఎగబాకిన విషయం తెలిసిందే.
టెస్ట్ ఆల్‌రౌండర్స్ జాబితాలో రవీంద్ర జడేజా, ఆర్. అశ్విన్ వరుసగా మొదటి రెండు స్థానాల్లో నిలిచారు.
ఆసీస్‌తో తొలి టెస్ట్ ఆడకపోయినప్పటికీ, ఈ జాబితాలో వారు ర్యాంకులను నిలబెట్టుకున్నారు. ఇక టెస్ట్ బౌలర్స్ ర్యాంకింగ్స్‌లో మొహమ్మద్ సిరాజ్ 25వ స్థానంలో ఉన్నారు.
ఈ ర్యాంకింగ్స్ భారత్ క్రికెటర్ల అద్భుత ప్రదర్శనకు ప్రతిఫలంగా నిలిచాయి.
బుమ్రా, జైస్వాల్, కోహ్లీ, జడేజా, అశ్విన్ అందరూ తమ ర్యాంకులను మెరుగుపరుచుకోవడంతో, భారత జట్టు టెస్టుల్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.