Loading...
KKR Deal: రూ.3,737 కోట్లకు జయ్ మెహతా వాటా విక్రయం.. కొనుగోలుదారు ఎవరంటే?
రూ.3,737 కోట్లకు జయ్ మెహతా వాటా విక్రయం.. కొనుగోలుదారు ఎవరంటే?

KKR Deal: రూ.3,737 కోట్లకు జయ్ మెహతా వాటా విక్రయం.. కొనుగోలుదారు ఎవరంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2026
02:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) యాజమాన్యంలో కీలక మార్పు చోటుచేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జట్టు సహ యజమాని, బాలీవుడ్ నటి జూహీ చావ్లా భర్త జయ్ మెహతా తన వాటాలో సగం విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేకేఆర్‌లో జయ్ మెహతాకు 45 శాతం వాటా ఉండగా.. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌కు 55 శాతం వాటా ఉంది. తాజా సమాచారం ప్రకారం.. జయ్ మెహతా తనకున్న 45 శాతం వాటాలో 22.5 శాతం వాటాను అమెరికాకు చెందిన అరెస్ మేనేజ్‌మెంట్‌కు విక్రయిస్తున్నారు. ఇందుకోసం 400 మిలియన్ డాలర్లు (సుమారు రూ.3,737 కోట్లు) చెల్లించనున్నట్లు తెలుస్తోంది.

వివరాలు

నగదు రూపంలోనే లావాదేవీ..

ఇటీవల ఓ సంస్థ కేకేఆర్ మొత్తం విలువను రూ.16,634 కోట్లుగా అంచనా వేసింది. ఈ నేపథ్యంలో జయ్ మెహతా వాటా విక్రయ ఒప్పందం ఐపీఎల్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

2007లో షారుక్ ఖాన్, జయ్ మెహతా, జూహీ చావ్లా కలిసి ప్రమోటర్లుగా కోల్‌కతా నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించారు.

ఐపీఎల్ తొలి సీజన్‌కు ముందే కేకేఆర్ ఫ్రాంచైజీని దక్కించుకున్నారు. అప్పటి నుంచి ఈ ముగ్గురి ప్రమేయంతో జట్టు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

తాజాగా అమెరికాలో స్పోర్ట్స్ క్లబ్‌లను కలిగి ఉన్న అరెస్ మేనేజ్‌మెంట్‌తో జయ్ మెహతా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

ఈ లావాదేవీ పూర్తిగా నగదు రూపంలోనే జరగనుందని, ప్రస్తుతం చివరి దశలో ఉందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

వివరాలు

అధికారిక ఆమోదం రావాల్సి ఉంది

అయితే ఈ వాటా విక్రయానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి అధికారిక ఆమోదం లభించాల్సి ఉంది.

మరోవైపు ఈ ఒప్పందం ద్వారా బీసీసీఐకి కూడా భారీ ఆదాయం సమకూరనుంది. లావాదేవీ మొత్తం విలువలో ఐదు శాతం వాటా బీసీసీఐకి దక్కనుంది.

ADVERTISEMENT