Page Loader
నిరాశపరిచిన జెస్విన్ ఆల్డ్రిన్.. ఫైనల్లో చుక్కెదురు
నిరాశపరిచిన జెస్విన్ ఆల్డ్రిన్.. ఫైనల్లో చుక్కెదురు

నిరాశపరిచిన జెస్విన్ ఆల్డ్రిన్.. ఫైనల్లో చుక్కెదురు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 25, 2023
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ అథ్లెటిక్స్ లో భాగంగా హంగేరిలోని బుడాపెస్ట్‌లో జరుగుతున్న పురుషుల లాంగ్ జంప్ ఫైనల్‌లో జెస్విన్ ఆల్డ్రిన్ కు నిరాశ ఎదురైంది. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో పురుషుల లాంగ్ జంప్ లో ఫైనల్లో భారత తరుఫున జెస్విన్ ఆల్డ్రిన్ అర్హత సాధించిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల లాంగ్ జంప్ ఈవెంట్‌లో జెస్విన్ ఆల్డ్రిన్ 7.77 మీటర్ల లీగల్ మార్క్‌తో 11వ స్థానంలో నిలిచి నిరాశపరిచాడు. అతని మొదటి రెండు ప్రయత్నాలను ఫౌల్ చేసిన తర్వాత, ఆల్డ్రిన్ తన మూడవ ప్రయత్నంలో 7.77 మీటర్లు దూకాడు. మొదటి మూడు రౌండ్ల తర్వాత ఎనిమిది మంది జంపర్లు మాత్రమే పోటీలో పాల్గొంటుండగా.. మిగిలిన వారు ఎలిమినేట్ అయ్యారు.

Details

ఫిట్ నెస్ సమస్యతో బాధపడుతున్న ఆల్డ్రిన్

బుధవారం క్వాలిఫికేషన్లో మొత్తంగా 12వ స్థానంతో అల్డ్రిన్‌ ఫైనల్​ అర్హత సాధించాడు. మొదటి ప్రయత్నంలోనే 8 మీటర్ల దూరం దూకిన అతడు.. ఆ తర్వాతి రెండు ప్రయత్నాల్లో ఫౌల్‌ అయ్యాడు. 2022 USAలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఏడవ స్థానంలో నిలిచిన శ్రీశంకర్ తర్వాత, ఆల్డ్రిన్ షోపీస్‌లో ఫైనల్స్‌కు అర్హత సాధించిన రెండోవ భారతీయుడిగా నిలిచాడు. సీజన్ ప్రారంభంలో 8.42 మీటర్ల పెద్ద జంప్ చేసిన తర్వాత ఆల్డ్రిన్ 8 మీటర్ల మార్కును దాటలేకపోవడం గమనార్హం. కొంతకాలంగా ఫిట్ నెస్ సమస్యతో బాధపడుతున్న ఆల్డ్రిన్ జూలైలో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లకు దూరమైన విషయం తెలిసిందే.