Page Loader
గాయపడిన సంజూ శాంసన్ స్థానంలో జితేష్ శర్మ
టీ20 జట్టుకు దూరమైన సంజూ శాంసన్

గాయపడిన సంజూ శాంసన్ స్థానంలో జితేష్ శర్మ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 05, 2023
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా ప్లేయర్ సంజూ శాంసన్‌కి దురదృష్టం వెంటాడుతోంది. మంగళవారం వాంఖడే వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా సంజూకి గాయమైంది. అతని స్థానంలో ఐపీఎల్‌లో అకట్టుకున్న జితేష్ శర్మ టీ20లో అరంగేట్రం చేయనున్నారు. ఈ విషయాన్ని బుధవారం బీసీసీఐ ధ్రువీకరించింది. శ్రీలంక టీ20 మ్యాచ్‌లో మిడాఫ్‌లో సంజూ శాంసన్ డైవ్ చేసి బంతి పట్టుకున్నాడు. అయితే సంజూ కిందపడిన సమయంలో కాలుకి గాయమైంది. మ్యాచ్ తరువాత గాయాన్ని పరిశీలించిన వైద్యులు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. తొలి టీ20 మ్యాచ్‌లో సంజూశాంస‌న్ కేవ‌లం 5 ప‌రుగులు మాత్ర‌మే చేసి నిరాశ‌ ప‌రిచాడు.

టీమిండియా

శ్రీలంకతో తలపడే జట్టు ఇదే

జితేష్ ఈ మధ్య మంచి ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ T20 ట్రోఫీ 2022లో పది మ్యాచ్ ఆడాడు. 175 స్టైక్ రైట్‌తో 224 పరుగులు చేశాడు. ఓపెనర్ గా ఇషాన్ కిషన్ బరిలోకి దిగుతుండగా.. మిడిలార్డర్ స్థానంలో రాహుల్ త్రిపాఠి, జితేష్ కి మధ్య పోటి ఉండే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్-కీపర్), రుతురాజ్ గైక్వాడ్, శుభమాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేష్ శర్మ (wk), వాషింగ్టన్ సుందర్ , యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి ముఖేష్ కుమార్.