LOADING...
IPL 2026: 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి.. ఎవరికీ సాధ్యంకాని రికార్డు.. ఏంటో తెలుసా?
19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి.. ఎవరికీ సాధ్యంకాని రికార్డు.. ఏంటో తెలుసా?

IPL 2026: 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి.. ఎవరికీ సాధ్యంకాని రికార్డు.. ఏంటో తెలుసా?

వ్రాసిన వారు Moogati Shabari
Apr 19, 2026
10:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన 28వ మ్యాచ్‌లో రాజస్థాన్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో జోఫ్రా ఆర్చర్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఇన్నింగ్స్ మొదటి బంతికే కోల్‌కతా ఓపెనర్ టిమ్ సీఫెర్ట్‌ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్ తొలి బంతికే అత్యధికంగా 5 సార్లు వికెట్ తీసిన బౌలర్ల జాబితాలో మొహమ్మద్ షమీ రికార్డును ఆర్చర్ సమం చేశాడు. అంతకుముందు కూడా పృథ్వీ షా, ప్రియాంశ్ ఆర్య, ఫిల్ సాల్ట్, అభిషేక్ శర్మ వంటి కీలక ఆటగాళ్లను ఆర్చర్ తొలి బంతికే అవుట్ చేయడం విశేషంగా నిలిచింది.

వివరాలు

ఆ రికార్డును ఎవ్వరూ బ్రేేక్ చేయలేరుగా..

ఈ సీజన్‌లో ఆర్చర్ ప్రదర్శన కేవలం ఒక్క మ్యాచ్‌కే పరిమితం కాలేదు. గత పది రోజుల్లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో (బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతాపై) ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసి కొత్త చరిత్ర సృష్టించాడు. ఇలా వరుసగా మూడు మ్యాచ్‌ల్లో మొదటి బంతికే వికెట్ పడగొట్టిన ఏకైక బౌలర్‌గా ఆర్చర్ ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. ట్రెంట్ బౌల్ట్, ఉమేష్ యాదవ్, లసిత్ మలింగ వంటి దిగ్గజ బౌలర్లు కూడా ఈ రికార్డుకు దగ్గరలోకి రాలేకపోయారు. ఇక ఇన్నింగ్స్ తొలి బంతికే ఎక్కువసార్లు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో జోఫ్రా ఆర్చర్, మొహమ్మద్ షమీ తలా 5 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నారు.

వివరాలు

తొలి బంతికే వికెట్లు తీసిన టాప్ బౌలర్లు వీరే..

జోఫ్రా ఆర్చర్: 5 వికెట్లు మొహమ్మద్ షమీ: 5 వికెట్లు ట్రెంట్ బౌల్ట్: 3 వికెట్లు ఉమేష్ యాదవ్: 3 వికెట్లు లసిత్ మలింగ: 3 వికెట్లు

Advertisement