ఐపీఎల్‌లో భారీ సిక్సర్ ను కొట్టిన జోస్ బట్లర్
ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకూ 6 మ్యాచ్ లు ఆడి 244 పరుగులు చేశాడు. దీంతో ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. జైపూర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్‌లో జోస్ బట్లర్ 40 పరుగులతో రాణించాడు. ఈ మ్యాచ్లో బట్లర్ స్లో గా ఆడినా.. ఓ భారీ సిక్సర్ ను నమోదు చేసి సత్తా చాటాడు రాజస్థాన్ ఇన్నింగ్స్ లో ఐదో ఓవర్ వేసిన యుధ్వీర్ బౌలింగ్ లో బట్లర్ ఏకంగా 112 మీటర్లు భారీ సిక్సర్ ను కొట్టాడు. ఈ ఏడాది సీజన్ లో ఇదే రెండవ అతిపెద్ద సిక్సర్.
115 మీటర్ల సిక్సర్ ను బాదిన డుప్లిసెస్
2023 ఐపీఎల్ సీజన్ లో ఇప్పటివరకూ అతిపెద్ద సిక్సర్ నమోదు చేసిన రికార్డు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ పేరిట ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో డుప్లెసిస్ ఏకంగా 115 మీటర్ల భారీ సిక్సర్ ను నమోదు చేశాడు. ఈ సీజన్‌లో బట్లర్ 112 మీటర్ల సిక్సర్ బాది రెండో స్థానంలో నిలిచాడు. మ్యాచ్ విషయానికొస్తే.. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేసింది. దీంతో లక్నో చేతిలో రాజస్థాన్ 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.