IPL-Cricket-Buttler: ధోనీ, కోహ్లీని అనుసరించాను: బట్లర్
ఈ వార్తాకథనం ఏంటి
కోల్ కతా(Kolkata)జట్టుపై రాజస్థాన్(Rajsthan)జట్టు సాధించిన విజయంపై రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్ (Buttler)స్పందిచారు.
జట్టును గెలిపించడంలో ఎంఎస్ ధోనీ(Dhoni), విరాట్ కోహ్లీ(Virat Kohli)లను అనుసరించానని చెప్పాడు.
మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్ కతా జట్టుపై శతకం చేయడమే కాకుండా చివరి బంతి వరకూ క్రీజులో చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.
రాజస్థాన్ జట్టు లక్ష్య ఛేదనలో వికెట్లు చేజార్చుకున్నా జోస్ బట్లర్ మాత్రం ఏకాగ్రత చెదరకుండా చివరివరకూ ఉండి జట్టుకు అవసరమైన పరుగులు సాధించి అద్భుత విజయాన్నిఅందించాడు.
ఈ సందర్భంగా జోస్ బట్లర్ మీడియాతో మాట్లాడారు. ''మ్యాచ్ లో మనకు ఎంత ప్రతికూలత ఉన్నా...ఎక్కడో ఒక చోట బ్రేక్ పాయింట్ ఉంటుందన్న సంగక్కర మాటల్ని దృష్టిలో పెట్టుకుని మ్యాచ్ లో వెయిట్ చేశా.
IPL-Rajasthan Team
వెయిట్ చేసి దాడి చేశాను: బట్లర్
సరిగ్గా బౌలర్లు ఒత్తిడిలోకి వెళ్తున్న సమయంలోనే నేను తిరిగి వారిపై బ్యాటింగ్ దాడి చేయడం మొదలెట్టా.
రెండు షాట్లు కనెక్టయ్యే సరికి మంచి కాన్ఫిడెన్స్ లభించింది.
ధోనీ, కోహ్లీ కూడా ఇలాంటి వైఖరిని అనుసరించి తమ జట్లకు ఎన్నో విజయాలు చేకూర్చిపెట్టారు.
ఆ విషయంలో నేను వారినే అనుసరించాను."అని చెప్పాడు.